Home Loan: ఒక్క నెల హోమ్ లోన్ ఈఎమ్ఐ సమయానికి కట్టకపోతే ఇన్ని నష్టాలా.?
Home Loan: ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందుకే చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటారు లేదా కొనుగోలు చేస్తారు.
Home Loan
Home Loan: ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందుకే చాలా మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్ తీసుకుని ఇంటిని నిర్మించుకుంటారు లేదా కొనుగోలు చేస్తారు. తర్వాత ప్రతి నెలా EMI రూపంలో ఆ లోన్‌ను చెల్లిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు, జీతం ఆలస్యం లేదా ఇతర ఖర్చుల వల్ల EMI చెల్లించడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు ఏం జరగుగుతుంది.?
EMI బౌన్స్ అంటే ఏమిటి?
హోమ్ లోన్ EMI సాధారణంగా ప్రతి నెల ఒక నిర్దిష్ట తేదీన ఆటో డెబిట్ ద్వారా కట్ అవుతుంది. కానీ అకౌంట్‌లో సరిపడా డబ్బు లేకపోతే బ్యాంక్ EMIని కట్ చేయలేకపోతుంది. దీనినే EMI Bounce అంటారు. ఉదాహరణకు EMI రూ.25 వేలు ఉండగా అకౌంట్‌లో రూ.20 వేలే ఉంటే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. దీంతో బ్యాంక్ దాన్ని బౌన్స్‌గా నమోదు చేస్తుంది.
EMI బౌన్స్ అయితే బ్యాంక్ ఎలాంటి జరిమానా వేస్తుంది?
EMI బౌన్స్ అయిన వెంటనే బ్యాంక్ బౌన్స్ ఛార్జీలు వసూలు చేస్తుంది. సాధారణంగా ఇవి రూ.250 నుంచి రూ.500 వరకు ఉండొచ్చు. దీంతో పాటు లోన్‌పై అదనపు పెనాల్టీ కూడా ఉంటుంది. మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ ఆధారంగా ఇది మారుతుంది. కొన్ని బ్యాంకులు రూ.500 నుంచి రూ.1000 వరకు అదనపు జరిమానా వేయవచ్చు. అలాగే బకాయి EMIపై నెలకు 1 నుంచి 2 శాతం వరకు పీనల్ ఇంట్రెస్ట్ కూడా వసూలు చేసే అవకాశం ఉంటుంది.
మొదటిసారి EMI బౌన్స్ అయితే ఏం చేయాలి?
ఒక్కసారి మాత్రమే EMI బౌన్స్ అయి ఉంటే వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం మంచిది. బ్యాంక్ మేనేజర్‌కు మీ పరిస్థితిని వివరించి, ఇకపై ఇలా జరగదని చెప్పాలి. మీ సమస్య నిజమైనదిగా బ్యాంక్ భావిస్తే కొంత పెనాల్టీ తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే వెంటనే బకాయి EMI చెల్లించడం చాలా ముఖ్యం. ఆలస్యం చేస్తే అదనపు ఛార్జీలు పెరుగుతాయి. వరుసగా EMIలు బౌన్స్ అయితే సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. EMI బౌన్స్ సమాచారం వెంటనే క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తారు. దీని ప్రభావం మీ CIBIL స్కోర్‌పై పడుతుంది. ఒక్కసారి స్కోర్ తగ్గితే భవిష్యత్తులో కొత్త లోన్ తీసుకోవడం కష్టమవుతుంది. క్రెడిట్ కార్డు పొందడంలో కూడా ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా వరుసగా మూడు నెలలు EMI చెల్లించకపోతే మీ క్రెడిట్ హిస్టరీ బాగా దెబ్బతింటుంది. తర్వాత బ్యాంకులు మిమ్మల్ని రిస్క్ కస్టమర్‌గా చూడవచ్చు.
ఎక్కువ కాలం EMI చెల్లించలేకపోతే ఏం చేయాలి?
కొంతకాలం డబ్బు సమస్య ఉంటే బ్యాంక్‌తో ముందుగానే మాట్లాడటం మంచిది. మీ పరిస్థితిని వివరించి గ్రేస్ పీరియడ్ కోరవచ్చు. కొంతకాలం EMI నిలిపివేయాలని కూడా అభ్యర్థించవచ్చు. అలాగే జీతం ఆలస్యంగా వస్తే EMI తేదీ మార్చే అవకాశం ఉందా అని బ్యాంక్ మేనేజర్‌ను అడగవచ్చు. కొన్ని బ్యాంకులు నెల ప్రారంభంలో కాకుండా నెలాఖరులో EMI చెల్లించే సౌకర్యం కూడా ఇస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్‌తో కమ్యూనికేషన్ కొనసాగించడం చాలా ముఖ్యం. పూర్తిగా స్పందించకుండా ఉండడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.




