Home Loan: హోమ్ లోన్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? ఏ ప్రభుత్వ బ్యాంక్‌లో త‌క్కువ వ‌డ్డీ తెలుసా

Home Loan: ఇల్లు కొనడం లేదా నిర్మించడం చాలా మందికి పెద్ద కల. ఇక క‌ల‌ను హోమ్ లోన్లు నిజం చేస్తున్నాయి.

Mokshith
Published on: 19 May 2026 12:48 PM IST
Home Loan
X

Home Loan: హోమ్ లోన్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారా.? ఏ ప్రభుత్వ బ్యాంక్‌లో త‌క్కువ వ‌డ్డీ తెలుసా

Home Loan: ఇల్లు కొనడం లేదా నిర్మించడం చాలా మందికి పెద్ద కల. ఇక క‌ల‌ను హోమ్ లోన్లు నిజం చేస్తున్నాయి. అయితే హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. చిన్న వడ్డీ తేడా కూడా దీర్ఘకాలంలో లక్షల రూపాయలను ఆదా చేస్తాయి.

హోమ్‌లోన్ తీసుకునే స‌మ‌యంలో క‌చ్చితంగా ఒక‌టి రెండుసార్లు వ‌డ్డీ రేట్ల‌ను గ‌మ‌నించాలి. ఎక్కువ బ్యాంకుల‌ను సంద‌ర్శించి ఎక్క‌డ త‌క్కువ వడ్డీ ల‌భిస్తుందో గ‌మ‌నించాలి. ముఖ్యంగా ప్ర‌స్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో ఎక్కడ తక్కువ వడ్డీకి హోమ్ లోన్ లభిస్తుందో తెలుసుకోవడం అవసరం.

ప్రభుత్వ బ్యాంకుల్లో తాజా హోమ్ లోన్ వడ్డీ రేట్లు

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ బ్యాంకులు ప్రస్తుతం అందిస్తున్న కనిష్ట హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇవే. దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.25% వ‌డ్డీ అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 7.20%, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఇండియాలో 7.75%, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.15%, సెంట్ర‌ల్ బ్యాంక్ 7.15%, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.10% వ‌డ్డీకి లోన్‌లు అందిస్తున్నారు. ఈ జాబితా ప్రకారం ప్రస్తుతం అత్యల్ప వడ్డీ రేటుతో హోమ్ లోన్ అందిస్తున్న ప్రభుత్వ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

హోమ్ లోన్ తీసుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

హోమ్ లోన్ ఎంపికలో కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా మరికొన్ని అంశాలు కూడా చాలా కీలకం. ముఖ్యంగా ఈ మూడు విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి.

CIBIL స్కోర్ చాలా ముఖ్యం:

బ్యాంకులు ప్రకటించే తక్కువ వడ్డీ రేట్లు సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అధిక వడ్డీ వసూలు చేసే అవకాశం ఉంటుంది.

ప్రాసెసింగ్ ఫీజులు కూడా చెక్ చేయాలి:

చాలా మంది వడ్డీ రేటుపైనే దృష్టి పెడతారు. కానీ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఫీజుల రూపంలో అదనపు ఖర్చులు వసూలు చేస్తాయి. అందుకే మొత్తం ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోవాలి.

ఫ్లోటింగ్ రేట్ మంచిదా? ఫిక్స్‌డ్ రేట్ మంచిదా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఎక్కువగా ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గిస్తే మీ EMI కూడా ఆటోమేటిక్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. ఫిక్స్‌డ్ రేట్‌లో మాత్రం EMI స్థిరంగా ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్లలో పూర్తి సమాచారం

ప్రతి వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ స్థితి ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయి. అందుకే ఖచ్చితమైన వివరాల కోసం ఆయా బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లను పరిశీలించడం మంచిది. అక్కడ తాజా ఆఫర్లు, అర్హత వివరాలు, EMI కాలిక్యులేటర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story