Home Loan: హోమ్ లోన్‌కి ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి?.. త్వరగా పెర‌గాలంటే ఏం చేయాలి.?

Home Loan: ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే చాలా మంది ముందుగా హోమ్ లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు.

Mokshith
Published on: 18 May 2026 12:59 PM IST
Home Loan
X

Home Loan: హోమ్ లోన్‌కి ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి?.. త్వరగా పెర‌గాలంటే ఏం చేయాలి.?

Home Loan: ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే చాలా మంది ముందుగా హోమ్ లోన్ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. అయితే బ్యాంకులు లోన్ మంజూరు చేసే ముందు ముఖ్యంగా చూసేది సిబిల్ స్కోర్. ఇది బాగుంటే సులభంగా లోన్ లభిస్తుంది. లేదంటే లోన్ తిరస్కరణ లేదా అధిక వడ్డీ భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. మీరు గతంలో తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లులు ఎంత క్రమంగా చెల్లించారనే వివరాల ఆధారంగా ఈ స్కోర్ నిర్ణయిస్తారు. భారతదేశంలో క్రెడిట్ సమాచారం సేకరించే సంస్థ అయిన ట్రాన్స్ యూనియ‌న్ సిబిల్ స్కోర్‌ను రూపొందిస్తుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ ప్రొఫైల్‌గా పరిగణిస్తారు. అలాంటి వారికి బ్యాంకులు సులభంగా హోమ్ లోన్లు మంజూరు చేస్తాయి. 650 కంటే తక్కువ స్కోర్ ఉంటే లోన్ పొందడం కష్టమవుతుంది.

హోమ్ లోన్‌కు మంచి సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి?

హోమ్ లోన్ కోసం కనీసం 750 లేదా అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉండటం మంచిదని బ్యాంకులు సూచిస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీ రేటుతో లోన్ లభించే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో లోన్ పొందొచ్చు. లోన్ ఆమోదం త్వరగా జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సులభమవుతుంది. అయితే స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు అదనపు షరతులు పెట్టే అవకాశం ఉంది.

సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి 5 ముఖ్యమైన మార్గాలు

EMIలు సమయానికి చెల్లించాలి:

మీరు తీసుకున్న లోన్ల EMIలు ఆలస్యం కాకుండా క్రమంగా చెల్లించడం చాలా ముఖ్యం. ఒక్కసారి డిఫాల్ట్ అయినా స్కోర్‌పై ప్రభావం పడుతుంది.

క్రెడిట్ కార్డు బిల్లులు పెండింగ్ పెట్టొద్దు:

క్రెడిట్ కార్డు బిల్లులను డ్యూ డేట్‌కు ముందే చెల్లించాలి. కనీస మొత్తం మాత్రమే కాకుండా పూర్తి బిల్లు చెల్లిస్తే మంచిది.

తరచూ కొత్త లోన్లకు అప్లై చేయొద్దు:

చిన్న వ్యవధిలో ఎక్కువసార్లు లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే బ్యాంకులు నెగటివ్‌గా చూస్తాయి. దీంతో స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది.

సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్లలో బ్యాలెన్స్ ఉండాలి:

హోమ్ లోన్, కార్ లోన్ వంటి సెక్యూర్డ్ లోన్లతో పాటు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు వినియోగం కూడా సమతుల్యంగా ఉండాలి.

తరచూ క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవాలి:

సంవత్సరానికి కనీసం రెండు సార్లు మీ క్రెడిట్ రిపోర్ట్ పరిశీలించడం మంచిది. మీ పేరుతో ఎవరైనా మోసపూరితంగా లోన్ తీసుకున్నారా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు.

మీ సిబిల్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి?

మీరు స్వయంగా ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు. CIBIL అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి “Get Free CIBIL Score & Report” ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, PAN నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంట‌ర్‌ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌తో పాటు పూర్తి రిపోర్ట్ కూడా చూడొచ్చు. హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నవారు ముందుగానే తమ సిబిల్ స్కోర్ మెరుగుపరుచుకుంటే మంచి వడ్డీ రేటుతో సులభంగా లోన్ పొందే అవకాశం ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story