Gold: అప్పుడు కొండంత.. ఇప్పుడు గోరంత..! 2000లో రూ. లక్షకు ఎంత బంగారం వచ్చేదో తెలుసా.?

Gold: ఒకప్పుడు లక్ష రూపాయలు పెడితే కొండంత బంగారం వచ్చేది.. కానీ ఇప్పుడు అదే లక్ష రూపాయలకు గోరంత కూడా రావడం లేదు.

Ravi
By Ravi
Published on: 10 Jun 2026 7:09 PM IST
How Much Gold Could You Buy With Rs 1 Lakh in 2000 vs 2026
X

అప్పుడు కొండంత.. ఇప్పుడు గోరంత..! 2000లో రూ. లక్షకు ఎంత బంగారం వచ్చేదో తెలుసా.?

Gold: భారతీయులకు బంగారం అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రోజురోజుకూ ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పసిడి ధరలు సామాన్యులను భయపెడుతున్నాయి. ఇరవై ఆరేళ్ల క్రితం లక్ష రూపాయలు పెడితే చేతికి ఎంత బంగారం వచ్చేదో, ఇప్పుడు అదే లక్ష రూపాయలకు ఎంత వస్తుందో మీకు తెలుసా. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

రూ. 1 లక్షకు ఏయే ఏడాదిలో ఎంత బంగారం వచ్చేదంటే.?

కాలక్రమేణా డబ్బు విలువ ఎలా కరిగిపోతూ వచ్చిందో, బంగారం విలువ ఎలా పెరుగుతూ వచ్చిందో ఈ గణాంకాలు చూస్తే మీకే అర్ధమవుతుంది.

2000వ సంవత్సరం: అప్పట్లో రూ. 1 లక్ష చేతిలో ఉంటే ఏకంగా 227 గ్రాముల బంగారం వచ్చేది.

2010 నాటికి: పదేళ్లు గడిచేసరికి పసిడి ధర పెరిగి, రూ. 1 లక్షకు వచ్చే బంగారం 54 గ్రాములకు పడిపోయింది.

2020వ సంవత్సరం: కరోనా సమయం నాటికి ఇది మరింత తగ్గి కేవలం 21 గ్రాములకు చేరింది.

2022 నాటికి: రూ. 1 లక్షకు వచ్చే పసిడి మరింత తగ్గి 19 గ్రాములకు పడిపోయింది.

2024లో: ధరలు విపరీతంగా పెరగడంతో ఇది ఏకంగా 13 గ్రాములకు దిగజారింది.

2025 నాటికి: ఇది దాదాపు సగానికి పడిపోయి కేవలం 7 గ్రాముల దగ్గర ఆగింది.

2026 మే నెల చివరికి: అదే రూ. 1 లక్ష పట్టుకుని మార్కెట్‌కు వెళితే కేవలం 6 గ్రాముల బంగారమే వస్తుండటం గమనార్హం.

ఒకప్పుడు లక్ష రూపాయలు పెడితే కళ్లకు నిండుగా కొండంత బంగారం కనిపించేది. కానీ ఇప్పుడు అదే మొత్తానికి కనీసం తులం బంగారం కూడా రాకపోవడం, కేవలం 'గోరంత'(6 గ్రాములు) మాత్రమే వస్తుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ లెక్కలు చూస్తుంటే కాలానుగుణంగా మార్కెట్లో ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉందో, అదే సమయంలో పసిడికి ఉన్న డిమాండ్, దాని పెట్టుబడి విలువ ఎలా అమాంతం పెరుగుతూ వస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తోంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story