నెలకు రూ.30 వేల జీతంతో కోటీశ్వరులు కావచ్చా? ఈ సింపుల్ ప్లాన్‌తో సాధ్యమే
Savings Scheme: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టాలని అనుకుంటారు.
నెలకు రూ.30 వేల జీతంతో కోటీశ్వరులు కావచ్చా? ఈ సింపుల్ ప్లాన్‌తో సాధ్యమే
Savings Scheme: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టాలని అనుకుంటారు. అయితే నెలకు రూ.30 వేల జీతం వచ్చే వారు కూడా కోటి రూపాయల నిధిని సమకూర్చుకోగలరా? అంటే కచ్చితంగా అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
నెల జీతంలో 20 శాతం పెట్టుబడి పెట్టండి
మీ నెలవారీ జీతం రూ.30 వేలు అనుకుందాం. ఇందులో కనీసం 20 శాతం అంటే రూ.6,000ను ప్రతి నెలా పెట్టుబడికి కేటాయించాలి. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లలో SIP రూపంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతూ వెళ్తే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవచ్చు. అయితే మధ్యలో పెట్టుబడిని ఆపకుండా కొనసాగించడం చాలా ముఖ్యం. మార్కెట్ హెచ్చుతగ్గులకు భయపడి తరచూ పెట్టుబడులను మార్చకుండా, దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగాలి.
20 ఏళ్లలో రూ.కోటి ఎలా సాధ్యమవుతుంది?
మీరు నెలకు రూ.6,000 చొప్పున SIP ప్రారంభించారని అనుకుందాం. ఏటా సగటున 12 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, సుమారు 20 ఏళ్లలో మీ పెట్టుబడి విలువ కోటి రూపాయలకు చేరువ కావచ్చు. ఈ కాలంలో మీరు పెట్టే అసలు పెట్టుబడి సుమారు రూ.14.40 లక్షలు మాత్రమే. మిగిలిన మొత్తం పెట్టుబడిపై వచ్చే రాబడి ద్వారా సమకూరుతుంది. అంటే చిన్న మొత్తంతో ప్రారంభించినా, ఎక్కువ కాలం పెట్టుబడిని కొనసాగించడం వల్ల సంపదను పెంచుకునే అవకాశం ఉంటుంది.
జీతం పెరిగితే SIP కూడా పెంచండి
మీ జీతం రూ.30 వేల నుంచి రూ.40 వేలు లేదా రూ.50 వేలకు పెరిగినప్పుడు ఖర్చులకే మొత్తం ఆదాయాన్ని కేటాయించకుండా పెట్టుబడిని కూడా పెంచాలి. దీనినే స్టెప్‌అప్ SIP అంటారు. ఉదాహరణకు మొదటి ఏడాది నెలకు రూ.6,000 పెట్టుబడి పెడితే, రెండో ఏడాది దానిని 10 శాతం పెంచి రూ.6,600 చేయాలి. మూడో ఏడాది రూ.7,260 పెట్టుబడి పెట్టాలి. ఇలా ప్రతి ఏడాది SIP మొత్తాన్ని 10 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి.
దీంతో పెట్టుబడి మొత్తం పెరగడమే కాకుండా, వచ్చే రాబడి కూడా కాలక్రమంలో పెరిగే అవకాశం ఉంటుంది.
కోటి రూపాయల లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవచ్చు
ప్రతి ఏడాది SIP మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్తే, సాధారణ SIPతో పోలిస్తే కోటి రూపాయల లక్ష్యాన్ని సుమారు 4 నుంచి 7 ఏళ్లు ముందుగానే చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది పెట్టుబడి వ్యవధి, మార్కెట్ రాబడిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మ్యూచువల్ ఫండ్లలో వచ్చే రాబడికి ఎలాంటి హామీ ఉండదు. 12 శాతం రాబడి అనేది కేవలం అంచనా మాత్రమే. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారవచ్చు. కాబట్టి మీ ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టాలి. చిన్న మొత్తంతో ప్రారంభించి, క్రమంగా పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో మంచి సంపదను నిర్మించుకోవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకుని ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.




