Debts: అప్పు తీర్చలేక ఇబ్బందిపడుతున్నారా.? ఇలా చేస్తే సులువుగా తీర్చేయొచ్చు

Debts: అప్పుల ఊబిలో కూరుకుపోయారా? ఎంత సంపాదించినా ఈఎంఐలు, వడ్డీలకే సరిపోతోందా?

Ravi
By Ravi
Published on: 4 Jun 2026 4:25 PM IST
Debts
X

Debts: అప్పు తీర్చలేక ఇబ్బందిపడుతున్నారా.? ఇలా చేస్తే సులువుగా తీర్చేయొచ్చు

Debts: ప్రతి నెలా వచ్చే జీతం చేతికి రాకముందే ఈఎంఐలకు, అప్పుల వడ్డీలకే సరిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. "అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తున్నాను" అని బాధపడేవారు మనలో చాలామందే ఉంటారు. అప్పులను వేగంగా ఎలా తీర్చుకోవాలి అనే దానిపై ఒక ప్రణాళికను వివరించారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్.

అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే ముందుగా మనకున్న అప్పులు ఏమిటి, వాటికి ఎంత వడ్డీ కడుతున్నాం అనేది ఒక పేపర్ మీద స్పష్టంగా రాసుకోవాలి. బయట తెచ్చిన అప్పులు, క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్లు.. ఇలా అన్నింటినీ ఒక జాబితా చేయాలి. వీటిలో ఏ అప్పుకైతే అత్యధిక వడ్డీ చెల్లిస్తున్నామో ముందుగా దాన్ని తీర్చేయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి. వడ్డీ తక్కువగా ఉండే హౌసింగ్ లోన్ లాంటి వాటిని నెమ్మదిగా తీర్చుకున్నా పర్వాలేదు కానీ, ఎక్కువ వడ్డీ భారం ఉండే అప్పులను మాత్రం వీలైనంత త్వరగా క్లియర్ చేయాలి.

అప్పులు తీరుస్తున్న సమయంలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన జాగ్రత్త.. కొత్త అప్పులు చేయకపోవడం! అనవసరపు ఖర్చులను పూర్తిగా తగ్గించుకుని, బడ్జెట్ వేసుకుని కఠినంగా పాటించాలి. అలాగే మనలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు 'హెల్త్ ఇన్సూరెన్స్' లేకపోవడం. ఇంట్లో ఎవరికైనా అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రి ఖర్చుల కోసం లక్షలకు లక్షలు మళ్లీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి కచ్చితంగా కుటుంబం మొత్తానికి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే భవిష్యత్తులో అప్పుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

అప్పులు ఉన్నాయని మానసికంగా కుంగిపోకుండా, ఒక స్పష్టమైన లక్ష్యంతో అడుగు ముందుకు వేయాలి. ఆర్థిక క్రమశిక్షణతో ఉంటూ అప్పులన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ పోతే కొన్నాళ్లకే మీ కళ్లముందే ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story