Money: 10 ఏళ్లలో రూ. 1 కోటి సంపాదించాలంటే.. ఎక్కడ.? ఎంత ఇన్వెస్ట్ చేయాలి.?

Money: కేవలం పదేళ్లలో కోటి రూపాయలు సంపాదించాలనేది మీ కలనా.? అయితే అది అసాధ్యమేమీ కాదు.

Ravi
By Ravi
Published on: 7 Jun 2026 5:14 PM IST
Money
X

Money: 10 ఏళ్లలో రూ. 1 కోటి సంపాదించాలంటే.. ఎక్కడ.? ఎంత ఇన్వెస్ట్ చేయాలి.?

Money: పిల్లల పైచదువులు, సొంత ఇల్లు, లేదా ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం.. కారణం ఏదైనా ప్రతి ఒక్కరికీ తమ జీవిత కాలంలో కనీసం రూ. 1 కోటి వెనకేసుకోవాలనే కల కచ్చితంగా ఉంటుంది. అయితే అది సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని, సరైన ప్రణాళిక ఉంటే కేవలం 10 సంవత్సరాల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

దీనికోసం ప్రధానంగా "ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్" అనేవి అద్భుతమైన మార్గమని అన్నారు. మీరు నెలకు రూ. 44 వేల చొప్పున ఒక మంచి డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే, సగటున 12 శాతం వార్షిక రాబడితో 10 సంవత్సరాల్లో మీ కార్పస్ సులభంగా రూ. 1 కోటి చేరుకుంటుంది. ఒకే దగ్గర కాకుండా, మార్కెట్ క్యాప్స్, సెక్టార్లలో పెట్టుబడులను డైవర్సిఫై చేసుకోవడం ద్వారా రిస్క్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.

నెలకు రూ. 44 వేలు కట్టలేని వారి పరిస్థితి ఏంటి.?

నెలకు రూ. 44 వేలు ఆదా చేయడం సామాన్యులకు సాధ్యం కాదు. దీనికి ఒక అద్భుతమైన 'స్టెప్-అప్ ప్లాన్' ఇదిగో. మీ స్థోమతను బట్టి నెలకు రూ. 15 వేలు లేదా రూ. 25 వేలతో ముందు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి. ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగేకొద్దీ, మీ పెట్టుబడి మొత్తాన్ని క్రమం తప్పకుండా కనీసం 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి(ఉదాహరణకు రూ. 25 వేలు కడితే, మరుసటి ఏడాది దానికి మరో రూ. 2,500 కలిపి కట్టాలి). ఇలా చేయడం ద్వారా కూడా మీరు పదేళ్లలో టార్గెట్ చేరుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద ఒకేసారి పెద్ద మొత్తం(రూ. 25 లక్షలు) ఉంటే గనుక, దాన్ని లంసంగా మంచి ఫండ్‌లో వేసి పదేళ్ల పాటు మర్చిపోతే.. కాంపౌండింగ్ ద్వారా అది రూ. 1 కోటికి చేరుతుంది.

చేయకూడని తప్పులు ఇవే!

ఈ పదేళ్ల ప్రయాణంలో మార్కెట్లో ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. మార్కెట్ పడిపోయినప్పుడు లేదా రెండు మూడేళ్లు సరైన రిటర్న్స్ రాలేదని కంగారు పడి ఎస్ఐపీ ఆపేయడం లేదా డబ్బంతా వెనక్కి తీసుకోవడం చాలామంది చేసే అతిపెద్ద తప్పు. రియల్ ఎస్టేట్, గోల్డ్‌లో లాగానే ఈక్విటీల్లో కూడా ఓపిక ఎంతో ముఖ్యం. తక్కువ ధరలో ఉన్నప్పుడే ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం వస్తుందని గుర్తుంచుకోవాలి. తగినంత ఎమర్జెన్సీ ఫండ్, మంచి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుని, ఓపికగా 10 ఏళ్లు డిసిప్లిన్‌తో పెట్టుబడి కొనసాగిస్తే 'రూ. 1 కోటి' అనేది పెద్ద కష్టమేమీ కాదని స్పష్టం చేశారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story