VIP Mobile Numbers: జియో, వొడాఫోన్‌లో వీఐపీ మొబైల్ నంబర్ కావాలా.? ఇలా ఈజీగా పొందొచ్చు.!
VIP Mobile Numbers: జియో, వొడాఫోన్ నెట్‌వర్క్‌లలో మీకు నచ్చిన వీఐపీ లేదా ఫ్యాన్సీ మొబైల్ నంబర్‌ను ఇంటివద్దే పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.
VIP Mobile Numbers: జియో, వొడాఫోన్‌లో వీఐపీ మొబైల్ నంబర్ కావాలా.? ఇలా ఈజీగా పొందొచ్చు.!
VIP Mobile Numbers: ప్రస్తుత డిజిటల్ కాలంలో అందరికీ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా ప్రత్యేక నంబర్‌లను ఎంచుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. సాధారణ నంబర్లకు బదులుగా సులభంగా గుర్తుండిపోయే లేదా లక్కీ డిజిట్స్‌తో కూడిన వీఐపీ నంబర్‌లను పొందడం ఇప్పుడు మరింత సులభమైంది.
దీనికోసం టెలికాం ఆపరేటర్ల స్టోర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారానే బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు ఈ ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. జియో వినియోగదారులు తమకు నచ్చిన లేదా ప్రస్తుత నంబర్‌ను పోలిన ఫ్యాన్సీ నంబర్‌ను పొందడానికి మై జియో యాప్‌ను ఉపయోగించవచ్చు.
యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్విక్ లింక్స్ సెక్షన్‌లోకి వెళ్లి మ్యాచింగ్ నంబర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ సూచించిన విధంగా అవసరమైన వివరాలు నమోదు చేస్తే స్క్రీన్‌పై వివిధ రకాల నంబర్ల జాబితా కనిపిస్తుంది. అందులో నచ్చిన నంబర్‌ను ఎంచుకుని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధులు ఆ నంబర్‌తో కూడిన కొత్త సిమ్‌ను నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తారు.
మరోవైపు వొడాఫోన్ ఐడియా యూజర్లు మైవి యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వీఐపీ నంబర్లను ఎంచుకోవచ్చు. ఫ్యాన్సీ నంబర్ బుకింగ్ పేజీకి వెళ్లి మీకు నచ్చిన నంబర్ పాటర్న్ లేదా ఇష్టమైన అంకెలను ఎంటర్ చేయాలి. అప్పుడు అందుబాటులో ఉన్న ఫ్రీ అలాగే ప్రీమియం నంబర్ల జాబితా తెరపై ప్రత్యక్షమవుతుంది.
ఆ జాబితా నుండి మీకు నచ్చిన నంబర్‌ను సెలెక్ట్ చేసుకుని మీ ప్రాంతపు పిన్ కోడ్, డెలివరీ అడ్రస్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత సిమ్ కార్డు మీ ఇంటికి చేరుకుంటుంది. ఈ వీఐపీ లేదా ఫ్యాన్సీ నంబర్ల ధరలు వాటి ప్రత్యేకతను బట్టి మారుతుంటాయి. సాధారణ నంబర్లకు నామమాత్రపు ప్రారంభ చార్జీలు ఉండగా, అత్యంత ప్రత్యేకమైన అంకెలు కలిగిన ప్రీమియం నంబర్లకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణ సిమ్ లేదా ప్రారంభ ఆఫర్ల కోసం రూ. 50 వరకు ఉండగా, ప్రత్యేకమైన ప్రీమియం నంబర్ల ధరలు రూ. 12 వేల వరకు ఉండే అవకాశం ఉంది. వినియోగదారులు తమ బడ్జెట్ ఆధారంగా నంబర్‌ను ఎంచుకోవచ్చు. కొత్త సిమ్ యాక్టివేట్ కావడానికి మొదటి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. బుకింగ్ చేసే ముందే టెలికాం సంస్థల అధికారిక యాప్‌లలోని నిబంధనలను పరిశీలించడం ఉత్తమం.




