Elon Musk: ప్రతీ వ్యక్తికి ఉచితంగా రూ. 8 వేలు పంచినా.! నెంబర్ వన్ ప్రపంచ కుబేరుడు మస్కే.!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ ఏ స్థాయిలో ఉందో తెలిసేలా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
Elon Musk: ప్రతీ వ్యక్తికి ఉచితంగా రూ. 8 వేలు పంచినా.! నెంబర్ వన్ ప్రపంచ కుబేరుడు మస్కే.!
Elon Musk: టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ సంపద సామాన్యుల ఊహకు సైతం అందనంత భారీగా ఉంది. ఎప్పుడూ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆయన నికర ఆస్తుల విలువ ఏ స్థాయిలో ఉందో చెప్పేలా ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం భూమిపై సుమారు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎలాన్ మస్క్ తలో రూ. 8,000 చొప్పున ఉచితంగా పంచిపెట్టినా కూడా, ఆయన తన ప్రపంచ కుబేరుడి స్థానాన్ని ఏమాత్రం కోల్పోడట.
ఎలాన్ మస్క్ సంపద ఎంత బారీ స్థాయిలో ఉందో, ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకే సోషల్ మీడియాలో ఈ క్యాలిక్యులేషన్‌ను వాడుతున్నారు.
మస్క్ సంపదకు మూల కారణాలు:
ఎలాన్ మస్క్ సంపద వందల బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఆయన స్థాపించిన వినూత్న టెక్నాలజీ కంపెనీలే ప్రధాన కారణం.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్ ఆయనకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. నాస్‌డాక్ మార్కెట్‌లో ఈ కంపెనీల షేర్లకు భారీ డిమాండ్ ఉంది. గ్రామీణ ప్రాంతాలకు సైతం శాటిలైట్ ఇంటర్నెట్ అందించే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది.
అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో xAI పేరుతో ఆయన మరో సంచలనానికి తెరతీశారు. ఏఐ టెక్నాలజీలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ లాంటి దిగ్గజాలతో సైతం మస్క్ నేరుగా పోటీ పడుతున్నారు.
ఒక్క వ్యక్తి సంపద ప్రపంచంలోని అనేక దేశాల జీడీపీల కంటే ఎక్కువగా ఉండటం, ఆయన తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ డబ్బులు పంచగలిగే స్థాయిలో ఉండటం నెటిజన్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.




