Petrol: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్‌పై బిగ్ రిలీఫ్.. !
Petrol: కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్నును సవరించింది.
Petrol: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్‌పై బిగ్ రిలీఫ్.. !
Petrol Exports: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల ఉచ్చు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయంగా చమురు లభ్యతను సమతుల్యం చేయడం, దేశీయ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఇంధన ఎగుమతులపై విధించే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ విధానంలో కీలక మార్పులు చేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై ఉన్న విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా సున్నాకు తగ్గించగా, డీజిల్ మరియు విమాన ఇంధనం ఎగుమతులపై పన్ను భారాన్ని మరింత పెంచడం గమనార్హం.
పెట్రోల్‌పై గతంలో ఉన్న లీటరుకు రూ. 2.50 సుంకాన్ని కేంద్రం పూర్తిగా రద్దు చేసి సున్నాగా మార్చింది. డీజిల్ ఎగుమతులపై గతంలో లీటరుకు రూ. 8.50 గా ఉన్న విండ్‌ఫాల్ టాక్స్‌ను రూ. 3 పెంచి, ఇప్పుడు రూ. 11.50కి చేర్చింది. విమాన ఇంధనం ఎగుమతులపై లీటరుకు 50 పైసలు పెంచి, రూ. 11.00కి పన్నును నిర్ధారించింది. ఈ నూతన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. పక్షం రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలను సమీక్షించి ఈ విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను కేంద్రం సవరిస్తూ ఉంటుంది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినప్పుడు, దేశీయ చమురు శుద్ధి సంస్థలు దేశీయంగా అమ్మడం కంటే విదేశాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు పొందేందుకు మొగ్గుచూపుతాయి. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే సంస్థలు ఆర్జించే ఆకస్మిక అదనపు లాభాలపై అడ్డుకట్ట వేస్తూ, దేశీయ వినియోగానికి ఇంధనం కొరత రాకుండా చూసేందుకు కేంద్రం 2022 జులైలో తొలిసారిగా ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రష్యా-ఉక్రెయిన్, అలాగే ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ధరలలో తీవ్ర మార్పులు రావడంతో కేంద్రం ఈ పన్నులను నిరంతరం సమీక్షిస్తోంది.
విండ్‌ఫాల్ టాక్స్ సవరణల వార్త వినగానే సామాన్య వాహనదారుల్లో ఒకటే ఆందోళన... బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? అని. ఈ పన్ను సవరణ కేవలం దేశం నుంచి విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపై మాత్రమే వర్తిస్తుంది. దేశీయంగా రిటైల్ మార్కెట్లో విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలపై లేదా సుంకాలపై ఎలాంటి మార్పు లేదు. కాబట్టి సాధారణ వాహనదారులకు బంకుల్లో లభించే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.




