Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్!

Ticket Cancellation Rules: భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ క్యాన్సిలేషన్ మరియు రిఫండ్ విధానంలో భారీ మార్పులు చేపట్టింది.

Arun Chilukuri
Published on: 24 March 2026 2:54 PM IST
Indian Railways
X

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్!

Ticket Cancellation Rules: భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం టికెట్ క్యాన్సిలేషన్ మరియు రిఫండ్ విధానంలో భారీ మార్పులు చేపట్టింది. రైలు బయల్దేరే సమయం ఆధారంగా రిఫండ్ ఇచ్చే పద్ధతిని సవరిస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 మధ్య దశలవారీగా అమలులోకి రానున్నాయి.

కొత్త రిఫండ్ విధానం ఇలా..

ఇకపై టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రిఫండ్ మొత్తాన్ని లెక్కిస్తారు.

72 గంటల ముందు: ప్రయాణానికి 72 గంటల ముందు కన్ఫర్మ్ టికెట్ రద్దు చేసుకుంటే 'మ్యాగ్జిమమ్ రిఫండ్' లభిస్తుంది.

72 నుండి 24 గంటల మధ్య: టికెట్ ధరలో 25 శాతం మినహాయించుకుని మిగిలిన మొత్తం వెనక్కి ఇస్తారు.

24 నుండి 8 గంటల మధ్య: దీనిని 'లేట్ క్యాన్సిలేషన్'గా పరిగణించి 50 శాతం మొత్తాన్ని కోత విధిస్తారు.

8 గంటల కంటే తక్కువ: రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు లేదా ట్రైన్ కదిలిన తర్వాత రద్దు చేస్తే ఎలాంటి రిఫండ్ లభించదు.

బోర్డింగ్ పాయింట్ మార్పుపై వెసులుబాటు

నగరాల్లో ఎక్కువ స్టేషన్లు ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బోర్డింగ్ పాయింట్ నిబంధనను సవరించారు. ఇకపై ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకోవచ్చు. గతంలో చార్ట్ ప్రిపేర్ అయ్యే వరకు మాత్రమే ఈ అవకాశం ఉండేది.

మరికొన్ని కీలక సంస్కరణలు:

ఏ స్టేషన్‌లోనైనా క్యాన్సిలేషన్: గతంలో కౌంటర్ టికెట్లను కేవలం రైలు ప్రారంభమయ్యే స్టేషన్‌లోనే రద్దు చేసే వీలుండేది. ఇకపై దేశంలోని ఏ రైల్వే స్టేషన్‌లోనైనా రద్దు చేసుకోవచ్చు.

ఆటోమేటిక్ టీడీఆర్ (TDR): ఇ-టికెట్ ప్రయాణికులు ఇకపై మాన్యువల్‌గా టీడీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఆటోమేటిక్‌గా రిఫండ్ ప్రక్రియ జరుగుతుంది.

క్లాస్ అప్‌గ్రేడేషన్: కౌంటర్ టికెట్ కలిగిన వారు ప్రయాణానికి 30 నిమిషాల ముందు కూడా తమ ప్రయాణ తరగతిని (Class) అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.

ప్రస్తుత ఛార్జీలు (పాతవి):

ప్రస్తుతం 48 గంటల ముందు రద్దు చేస్తే ఏసీ ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240, స్లీపర్‌కు రూ.120 చొప్పున స్థిరమైన క్యాన్సిలేషన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధనల అమలుతో ఈ విధానంలో మరింత స్పష్టత రానుంది.

రైల్వే శాఖ చేపట్టిన ఈ సంస్కరణలు ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story