New Bank Rules: నవంబర్ నుంచి కొత్త రూల్స్..ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే పెనాల్టీ!

New Bank Rules: ఇండస్ ఇండ్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులకు బిగ్ షాక్.

Gagan kumar
Published on: 2 Nov 2026 12:20 PM IST
New Bank Rules
X

New Bank Rules: నవంబర్ నుంచి కొత్త రూల్స్..ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయితే పెనాల్టీ!

New Bank Rules: ఇండస్ ఇండ్ బ్యాంక్ తమ సేవింగ్స్ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందించిన పలు సేవలకు స్వస్తి పలుకుతూ, విఫలమయ్యే లావాదేవీలపై కఠినమైన సేవా రుసుములను ప్రకటించింది.

నవంబర్ 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన ఈ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాలో తగినంత నిధులు లేకపోవడం లేదా సాంకేతిక లోపాల వల్ల లావాదేవీలు రద్దయితే కస్టమర్ల జేబులకు చిల్లు పడనుంది. ఈ నూతన ఛార్జీల పూర్తి వివరాలు, ఏయే ఖాతాలకు ఇవి వర్తిస్తాయో సవివరంగా తెలుసుకుందాం.

షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులలో పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా స్వైప్ చేసి చెల్లింపులు జరిపే సమయంలో ఖాతాలో బ్యాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఇకపై పెనాల్టీ పడుతుంది.

ప్రతి విఫలమైన పిఓఎస్ లావాదేవీపై రూ. 25 + జీఎస్టీ కట్ అవుతుంది. నిధుల లేమి వల్ల పిఓఎస్ వద్ద చెల్లింపు రద్దయినా ఎలాంటి రుసుము వసూలు చేసేవారు కాదు.

ఇండస్ ఇండ్ బ్యాంక్ ఖాతాదారులు తమ బ్యాంక్‌కు చెందిన ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసే సమయంలో ఖాతాలో తగినంత సొమ్ము లేక లావాదేవీ రిజెక్ట్ అయితే ఛార్జీ వర్తిస్తుంది. ప్రతి విఫల ఏటీఎం లావాదేవీకి రూ. 25 పెనాల్టీ వసూలు చేస్తారు. ఇతర బ్యాంక్ ఏటీఎంలలో ఫెయిల్ అయితే ఛార్జీలు ఉండేవి కానీ, సొంత బ్యాంక్ ఏటీఎంలలో ఉచిత విధానమే అమల్లో ఉండేది.

ఖాతాలో డబ్బుల కొరత కాకుండా ఇతర సాంకేతిక లేదా ఆర్థికేతర కారణాల వల్ల చెక్కు రిటర్న్ అయితే బ్యాంక్ ప్రత్యేక రుసుము నిర్ణయించింది. ప్రతి చెక్కు రిటర్నుపై రూ. 50 సవరించిన సేవా రుసుము వర్తిస్తుంది. ఆర్థికేతర కారణాల వల్ల చెక్కులు రిటర్న్ అయితే ఎలాంటి రుసుము ఉండేది కాదు.

ఇండస్ ఇండ్ బ్యాంక్ వెల్లడించిన ప్రకారం, కింద పేర్కొన్న డిజిటల్, రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాల వేరియంట్లకు ఈ నూతన ఛార్జీల నిబంధనలు వర్తిస్తాయి.

ఇండస్ డెలైట్, ఇండస్ డిజి స్టార్ట్, ఇండీ డిజిటల్ ఖాతాలు

బ్యాంక్ ఖాతాదారులు POS స్వైపింగ్ లేదా ఏటీఎం డ్రా చేసే ముందు తమ ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉందో లేదో మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవడం వల్ల ఈ అనవసర పెనాల్టీల నుంచి తప్పించుకోవచ్చు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.