Investment: రూ. 50 వేల జీత‌మున్నా కోటీశ్వ‌రులు కావొచ్చు.. ఈ లెక్క‌లు అర్థం చేసుకుంటే చాలు

Investment: నెలకు రూ.50 వేల జీతం వస్తే కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యం అని చాలా మంది అనుకుంటారు.

Mokshith
Published on: 29 July 2026 12:35 PM IST
Investment
X

Investment: రూ. 50 వేల జీత‌మున్నా కోటీశ్వ‌రులు కావొచ్చు.. ఈ లెక్క‌లు అర్థం చేసుకుంటే చాలు

Investment: నెలకు రూ.50 వేల జీతం వస్తే కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యం అని చాలా మంది అనుకుంటారు. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక, క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే ఇది సాధ్యమే. మ్యూచువ‌ల్ ఫం్‌లో ఎస్ఐపీ ద్వారా కోటీశ్వ‌రులు కావ‌డం పెద్ద క‌ష్టం కాద‌ని నిపుణులు చెబుతున్నారు.

జీతంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?

ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం, నెలవారీ ఆదాయంలో కనీసం 20 నుంచి 30 శాతం వరకు SIPలో పెట్టుబడి పెట్టడం మంచిది. అంటే నెలకు రూ.50 వేల జీతం వస్తే సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాదు, అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఫండ్ కూడా సిద్ధంగా ఉంచాలి. దీంతో అవసరమైన సమయంలో SIPను మధ్యలో ఆపాల్సిన పరిస్థితి రాదు. అలాగే అవసరం లేని అప్పులు చేయకుండా, త్వరగా ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

నెలకు రూ.12 వేల SIP చేస్తే ఎంత వస్తుంది?

ఒకవేళ మీరు ప్రతి నెలా రూ.12 వేల SIP ప్రారంభించినట్లయితే, దానికి సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తుందని అనుకుందాం. ఈ పెట్టుబడిని నిరంతరంగా కొనసాగిస్తే దాదాపు 20 సంవత్సరాల్లో మీ పెట్టుబడి విలువ రూ.1 కోటి వరకు చేరే అవకాశం ఉంది. అంటే 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే ఉద్యోగం వచ్చిన వెంటనే SIP ప్రారంభిస్తే, 20 ఏళ్లలో పెద్దగా ఒత్తిడి లేకుండానే కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

త్వరగా కోటి కావాలంటే స్టెప్-అప్ SIP చేయండి

20 సంవత్సరాలు వేచి ఉండాలని ఇష్టం లేకపోతే స్టెప్-అప్ SIP మంచి మార్గం. దీని అర్థం ఏంటంటే.. ప్రతి ఏడాది జీతం పెరిగినప్పుడు SIP మొత్తాన్ని కూడా 10 నుంచి 15 శాతం వరకు పెంచడం. ఉదాహరణకు మొదటి సంవత్సరం నెలకు రూ.12 వేల SIP చేస్తే, రెండో సంవత్సరం దాన్ని రూ.13,200కు, ఆ తర్వాత ఇంకా కొద్దిగా పెంచుకుంటూ వెళితే పెట్టుబడి వేగంగా పెరుగుతుంది. దీంతో కోటి రూపాయల లక్ష్యాన్ని 20 ఏళ్ల కంటే ముందే చేరుకునే అవకాశం ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్లపై పెరుగుతున్న ప్రజల నమ్మకం

దేశంలో మ్యూచువల్ ఫండ్లపై ప్రజల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2026 జూన్ నెలలో SIPల ద్వారా రూ.31,781 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక నెలవారీ పెట్టుబడుల్లో ఒకటి. ఇది 2026 మే నెలతో పోలిస్తే 2.7 శాతం ఎక్కువ.

అలాగే 2025 జూన్‌తో పోలిస్తే 16.5 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది 8.64 కోట్ల SIP ఖాతాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 9.78 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో SIPల ద్వారా నిర్వహిస్తున్న మొత్తం ఆస్తుల విలువ రూ.17.70 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల్లో 21.5 శాతం వాటాను కలిగి ఉండటం విశేషం.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story