IOCL: కేవలం పెట్రోలే కాదు... ఇకపై వాటర్ బాటిళ్లు కూడా..!
IOCL: ఇంధన విక్రయాలకే కాకుండా ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో సొంత బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయించనున్న ఐఓసీఎల్.
IOCL: కేవలం పెట్రోలే కాదు... ఇకపై వాటర్ బాటిళ్లు కూడా..!
IOCL: దేశ ప్రజలకు ఇంధనాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాలకే పరిమితం కాకుండా, తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంధనేతర ఆదాయాన్ని భారీగా పెంచుకోవాలనే లక్ష్యంతో... ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న తమ పెట్రోల్ బంకుల్లో సొంత బ్రాండ్‌తో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను విక్రయించడానికి సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఐఓసీఎల్ ఇప్పటికే థర్డ్-పార్టీ కంపెనీల నుండి ఆసక్తి వ్యక్తకరణ దరఖాస్తులను ఆహ్వానించింది.
భారతదేశంలోనే అత్యంత విస్తృతమైన రిటైల్ నెట్వర్క్ కలిగిన ఐఓసీఎల్‌కు దేశవ్యాప్తంగా 43,603 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయಿಯಲ್ಲಿ ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది.తొలి విడతగా జాతీయ , రాష్ట్ర రహదారులపై ఉన్న ఔట్లెట్లలో ఈ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. ప్రయాణికులకు సులభంగా మంచినీరు అందించేందుకు ఈ వ్యూహం దోహదపడుతుంది. హైవేల తర్వాత క్రమంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పెట్రోల్ బంకులకు ఈ సేవలను విస్తరించనున్నారు.
సామాన్యుల నుంచి అన్ని వర్గాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత సరసమైన ధరల్లో వీటిని మార్కెట్లోకి తీసుకురానున్నారు.
250 మి.లీ బాటిల్: రూ. 6/-
500 మి.లీ బాటిల్: రూ. 10/-
1 లీటరు బాటిల్: రూ. 20/-
ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత విజయవంతం చేయడానికి ఐఓసీఎల్ అగ్రిగేటర్ మోడల్‌ను అనుసరిస్తోంది. వాటర్ బాటిళ్ల తయారీ, నాణ్యతా ప్రమానాల పరిశీలన, లాజిస్టిక్స్, కూలర్ల ఏర్పాటు బాధ్యతలను భాగస్వామ్య కంపెనీలకు అప్పగిస్తారు. అయితే, బ్రాండ్ విలువకు ఎక్కడా రాజీ పడకుండా ట్రేడ్‌మార్క్, బాటిల్ డిజైన్ మాత్రం పూర్తిగా ఇండియన్ ఆయిల్ యాజమాన్యంలోనే ఉంటాయి. ఈ బిజినెస్ మోడల్‌ను అత్యంత లాభదాయకంగా తీర్చిదిద్దారు. పంపిణీదారులు , డీలర్లకు ఊహించని రీతిలో 25 నుండి 35 శాతం వరకు డీలర్ మార్జిన్ అందించనున్నారు.
దీనివల్ల డీలర్లకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుంది. మరోవైపు, ఈ మొత్తం వ్యాపారం ద్వారా ఇండియన్ ఆయిల్‌కు 12 శాతం ఆదాయ వాటా లభించేలా ఈ ప్రణాళికను రూపొందించారు.ఇంధన రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న ఇండియన్ ఆయిల్, ఇప్పుడు రిటైల్ మార్కెట్లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవడం విశేషం.




