iPhone: ఊహించని షాక్ ఇచ్చి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యాపిల్..!

iPhone: యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ డ్యూయో లాంచ్‌తో పాటు పాత ఐఫోన్ మోడళ్ల ధరలను భారీగా పెంచింది.

Gagan kumar
Published on: 11 Sept 2026 11:09 AM IST
iPhone
X

iPhone: ఊహించని షాక్ ఇచ్చి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన యాపిల్..!

iPhone: సాధారణంగా ఏ టెక్ కంపెనీ అయినా కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చినప్పుడు, పాత మోడళ్ల ధరలు తగ్గడం ఆనవాయితీ. కానీ, టెక్ దిగ్గజం యాపిల్ మాత్రం ఈ సారి రూట్ మార్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఐఫోన్ 18 ప్రో' సిరీస్‌తో పాటు, తమ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను గ్రాండ్‌గా ఆవిష్కరించిన యాపిల్... అదే సమయంలో పాత ఐఫోన్ల ధరలను విపరీతంగా పెంచేసి ఐఫోన్ ప్రేమికులకు ఊహించని షాక్ ఇచ్చింది.

గ్లోబల్ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత తీవ్రంగా ఉండటం, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల నుంచి వీటికి భారీగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి వ్యయం కొండెక్కింది. పెరిగిన ఈ తయారీ భారాన్ని కంపెనీ ఒక్కటే భరించడం సాధ్యం కాదు అని యాపిల్ సీఈఓ జాన్ టెర్నస్ తేల్చిచెప్పారు.

కొత్తగా వచ్చిన ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900గా ఉండగా, ప్రో మ్యాక్స్ వెర్షన్ రూ. 1,79,900 నిర్ణయించారు. ఈ కొత్త ఫోన్లు అందుబాటులోకి రాగానే పాత మోడళ్లపై కొత్త ధరల భారం అమల్లోకి వచ్చింది. యాపిల్ ఇండియా అధికారిక సమాచారం ప్రకారం పెరిగిన ధరల వివరాలు:

ఐఫోన్ 17 (256GB): రూ. 17,000 పెరిగి, ఇప్పుడు రూ. 99,900కు చేరింది.

ఐఫోన్ 17e: కొత్త ధర రూ. 79,900.

ఐఫోన్ 16 (128GB): పాత వేరియంట్ ధర రూ. 89,900కు పెరిగింది.

ఐఫోన్ ఎయిర్ (256GB): దీని ధర రూ. 1,49,900 తాకింది.

ఐఫోన్ ఎయిర్ (1TB): అత్యంత ఆశ్చర్యకరంగా ఈ టాప్-ఎండ్ వేరియంట్‌పై ఏకంగా రూ. 65,000 పెరగడంతో దీని ధర ఏకంగా రూ. 2,24,900కు చేరింది.

ఎప్పటికైనా ఐఫోన్ కొనాలని నిరీక్షిస్తున్న సగటు వినియోగదారుడికి యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద షాకే అని చెప్పాలి. చిప్‌ల కొరత సృష్టించిన ఈ సంక్షోభం టెక్ ప్రపంచంలో మునుపెన్నడూ లేని కొత్త ట్రెండ్‌కు తెరలేపింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story