మొబైల్ వినియోగదారులకు ఇక జేబుకు చిల్లే.! సైలెంట్‌గా ముంచేస్తారా.?
Jio and Airtel Tariff Hike: దేశంలో అతిపెద్ద టెలికాం దిగ్గజాలైన జియో మరియు ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మొబైల్ వినియోగదారులకు ఇక జేబుకు చిల్లే.! సైలెంట్‌గా ముంచేస్తారా.?
Jio and Airtel Tariff Hike: దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ తమ కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా ఈ ఏడాది రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచేందుకు ఈ రెండు సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, జియో, ఎయిర్‌టెల్ తమ టారిఫ్ ధరలను ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా 5G స్పెక్ట్రమ్ విస్తరణ కోసం ఈ టెలికాం సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు ఆ పెట్టుబడులను వీలైనంత త్వరగా రికవరీ చేసుకోవడంతో పాటు, తమ లాభాలను కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ టారిఫ్ పెంపునకు సంస్థలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
అయితే, ఈ రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపుపై టెలికాం సంస్థల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఇప్పటికే భారతి ఎయిర్‌టెల్ తన పాపులర్ ప్లాన్ అయిన రూ. 799 ప్లాన్‌ను సైలెంట్‌గా ఎత్తేసింది. దీన్నిబట్టి చూస్తుంటే త్వరలోనే ఈ టారిఫ్ పెంపు వార్తలు నిజమయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు




