Jio: జియో నుంచి అదిరిపోయే 'ఫ్రీడం ఆఫర్'.. 15 నెలల వ్యాలిడిటీతో 100Mbps స్పీడ్, ఓటీటీ బెనిఫిట్స్!

హై-స్పీడ్ ఇంటర్నెట్ యూజర్ల కోసం ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త 'ఫ్రీడం ఆఫర్'ను తీసుకువచ్చింది. ఏకంగా 15 నెలల వ్యాలిడిటీ, 100Mbps హై-స్పీడ్ ఇంటర్నెట్, అదనపు వినోద సదుపాయాలతో కూడిన ఈ ప్లాన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Ravi
By Ravi
Published on: 25 July 2026 6:32 PM IST
Jio
X

Jio: జియో నుంచి అదిరిపోయే 'ఫ్రీడం ఆఫర్'.. 15 నెలల వ్యాలిడిటీతో 100Mbps స్పీడ్, ఓటీటీ బెనిఫిట్స్!

Jio: భారతీయ టెలికాం రంగంలో తన సేవలతో ఎంతో మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో, తాజాగా హోమ్ బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ప్లాన్‌ను పరిచయం చేసింది. బ్రాండ్‌బ్యాండ్, ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ 'జియో ఫ్రీడం ఆఫర్' పేరిట ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి నెలా రీచార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఒకేసారి దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందాలనుకునేవారికి ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ సరికొత్త ఫ్రీడం ప్లాన్ ద్వారా వినియోగదారులకు ఏకంగా 15 నెలల పాటు నిరంతరం సేవలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. కేవలం రూ. 10,000 ధరతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు నెలకు కేవలం రూ. 666 ఖర్చుతోనే హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ బ్రాండ్‌బ్యాండ్ ప్లాన్ ద్వారా యూజర్లు అన్‌లిమిటెడ్ వైఫైతో పాటు డౌన్‌లోడ్, అప్‌లోడ్ రెండింటిలోనూ 100 Mbps వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను ఆస్వాదించవచ్చు. దీనివల్ల పెద్ద పెద్ద ఫైళ్లను క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ఎలాంటి బఫరింగ్ సమస్య లేకుండా హెచ్‌డీ వీడియోలను వీక్షించవచ్చు.

ఇంటర్నెట్ సేవలతో పాటు ఈ ప్లాన్‌లో అదనపు వినోదానికి కూడా పెద్దపీట వేశారు. జియోటీవీ యాప్ ద్వారా వెయ్యికి పైగా లైవ్ టీవీ ఛానెల్‌ల యాక్సెస్‌తో పాటు, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయని కంపెనీ తెలిపింది. కాగా, ఇప్పటికే ఉన్న జియోహోమ్ కస్టమర్లతో పాటు కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని సమాచారం. ప్రతి నెలా జరిగే రీచార్జ్ టెన్షన్లను దూరం చేస్తూ, ఒకే ప్లాన్‌తో సుదీర్ఘకాలం పాటు అన్‌లిమిటెడ్ వినోదాన్ని, ఇంటర్నెట్‌ను అందించే ఈ ఫ్రీడం ఆఫర్ మార్కెట్లో ప్రస్తుతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story