Jio Platforms IPO: జియో ఐపీఓకు భారీ డిమాండ్.. రెండో రోజు 5.6 రెట్లు సబ్స్క్రిప్షన్
Jio Platforms IPO: జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు ఇన్వెస్టర్ల బ్రహ్మరథం. రెండో రోజు ముగిసేసరికి 5.6 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది.
Jio Platforms IPO: జియో ఐపీఓకు భారీ డిమాండ్.. రెండో రోజు 5.6 రెట్లు సబ్స్క్రిప్షన్
Jio Platforms IPO: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్ఫామ్స్' పబ్లిక్ ఇష్యూ (IPO) మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఐపీఓ ప్రారంభమైన రెండో రోజు గురువారం (అక్టోబర్ 22) ముగిసే సమయానికి అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఏకంగా 5.6 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. కేవలం రెండో రోజే రూ.50,000 కోట్లకు పైగా విలువైన బిడ్లు నమోదు కాగా, యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లను కూడా కలుపుకుంటే మొత్తం డిమాండ్ ఊహించని రీతిలో రూ.3.73 లక్షల కోట్లకు చేరినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
క్యూఐబీ భాగస్వామ్యం కేక: క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో అత్యధికంగా 13.3 రెట్ల సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ విభాగం నుంచి ఏకంగా రూ.72,898 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి.
ఎన్ఐఐ & రిటైల్ రెస్పాన్స్: నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) కోటా 5.97 రెట్లు సబ్స్క్రైబ్ కాగా (రూ.24,330 కోట్లు), రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 1.54 రెట్లు సబ్స్క్రిప్షన్ పొందింది (రూ.14,652 కోట్లు).
షేర్హోల్డర్లు & ఉద్యోగులు: రిలయన్స్ (RIL) ప్రస్తుత వాటాదారుల కోటాలో 4 రెట్ల డిమాండ్ కనిపించగా, ఉద్యోగుల కేటాయింపులు 2.1 రెట్లు భర్తీ అయ్యాయి. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల భారీ దరఖాస్తులు రావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఐపీఓ ముగింపు & లిస్టింగ్ తేదీలు:
ఇష్యూ ముగింపు: అక్టోబర్ 23, 2026 (శుక్రవారం)
షేర్ల కేటాయింపు (Allotment): అక్టోబర్ 26, 2026 (సోమవారం)
డీమ్యాట్ ఖాతాల్లో జమ: అక్టోబర్ 27, 2026 (మంగళవారం)
స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్: అక్టోబర్ 28, 2026 (బుధవారం)




