Jio: యూట్యూబ్ ప్రీమియంతో పాటు 15కి పైగా ఓటీటీ యాప్ లు.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్

Jio: వినోదంతో పాటు డేటా కూడా కావాలనుకునే జియో వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. రూ. 200 OTT పాస్ను అందిస్తోంది.

Mokshith
Published on: 30 Jun 2026 12:00 PM IST
Jio
X

Jio: యూట్యూబ్ ప్రీమియంతో పాటు 15కి పైగా ఓటీటీ యాప్ లు.. జియో నుంచి అదిరిపోయే ప్లాన్

Jio: వినోదంతో పాటు డేటా కూడా కావాలనుకునే జియో వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ అందిస్తోంది. రూ. 200 OTT పాస్ను అందిస్తోంది. ఈ ప్లాన్ తో 30GB హైస్పీడ్ డేటాతో పాటు ఎన్నో బెనిఫిట్స్ లభించునున్నాయి. ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 200 OTT ప్లాన్ వివరాలు.

ఈ ప్లాన్ ధర రూ. 200. దీని వ్యాలిడిటీ 28 రోజులు. ఈ కాలంలో వినియోగదారులకు మొత్తం 30GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. 30GB డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64Kbpsకు తగ్గుతుంది. ఇది ప్రధానంగా డేటా, వినోద ప్రయోజనాల కోసం రూపొందించిన యాడ్-ఆన్ ప్లాన్.

15కి పైగా ప్రముఖ OTT యాప్ల యాక్సెస్

ఈ ప్లాన్ తో ఒకేసారి అనేక ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ లను ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇందులో యూట్యూబ్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5, Lionsgate Play, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, Hoichoi, Chaupal, FanCode, TimesPlay, Tarang Plus, Planet Marathi, Kanccha వంటి ప్లాట్ ఫార్మ్స్ కి

యాక్సెస్ లభిస్తుంది. ఒకే ప్లాన్లో ఇన్ని OTT సేవలు రావడం వినియోగదారులకు పెద్ద ప్రయోజనం.

YouTube Premium, Prime Video ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

ఈ ప్లాన్ లో లభించే YouTube Premium, Amazon Prime Video Mobile Edition ప్రయోజనాలను నేరుగా ఉపయోగించలేరు. వాటిని పొందాలంటే MyJio యాప్ లో కి వెళ్లి క్లెయిమ్ చేసుకోవాలి. క్లెయిమ్ చేసిన తర్వాత సంబంధిత OTT సేవలను వినియోగించుకోవచ్చు.

1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు కూడా

OTT యాప్లతో పాటు JioTV యాప్ ద్వారా 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. వార్తలు, క్రీడలు, వినోదం, సినిమాలు, ప్రాంతీయ ఛానళ్లు వంటి అనేక విభాగాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. దీంతో మొబైల్లోనే టీవీ అనుభవాన్ని పొందవచ్చు.

Jio 5G వినియోగదారులకు అదనపు ప్రయోజనం:

మీ వద్ద ఇప్పటికే Jio 5G బేస్ ప్లాన్ ఉండి, మీ ప్రాంతంలో True 5G సేవలు అందుబాటులో ఉంటే ఈ ప్లాన్ వ్యాలిడిటీ మొత్తం కాలానికి అపరిమిత 5G డేటా కూడా లభిస్తుంది. దీంతో 30GB డేటాతో పాటు వేగవంతమైన 5G ఇంటర్నెట్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

గమనిక: ₹200 OTT పాస్ ఒక యాడ్-ఆన్ ప్లాన్ మాత్రమే. కాబట్టి దీన్ని ఉపయోగించాలంటే ముందుగా మీ నంబర్ పై యాక్టివ్ బేస్ రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. OTT ప్లాట్ ఫామ్ ను ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story