Jio: జియో అదిరిపోయే ప్లాన్.. స్నాప్‌చాట్+, ఫ్యాన్‌కోడ్, జెమిని ప్రో!
Jio: యూత్ ను దృష్టిలో ఉంచుకుని జియో అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. గేమింగ్ ప్రియులతోపాటు సోషల్ మీడియాను విపరీతంగా వాడే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పొచ్చు.
Jio: జియో అదిరిపోయే ప్లాన్.. స్నాప్‌చాట్+, ఫ్యాన్‌కోడ్, జెమిని ప్రో!
Jio: యువతతోపాటు గేమింగ్ ప్రియుల కోసం రిలయన్స్ జియో సరికొత్త 'యూత్ అండ్ గేమింగ్ ప్లాన్'ను భారత్‌లో విడుదల చేసింది. కేవలం రూ. 459 ధరతో లభించే ఈ ప్లాన్ ద్వారా రోజువారీ డేటాతో పాటు వేల రూపాయల విలువైన కృత్రిమ మేధ (AI) సేవలు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, భారీ క్లౌడ్ స్టోరేజీని జియో అందిస్తోంది.
జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇందులో వినియోగదారులకు ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం మీద ఈ ప్లాన్ ద్వారా 61జీబీ డేటాను పొందవచ్చు. రోజువారీ పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. దీనితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యాలు ఉన్నాయి. అర్హులైన వినియోగదారులు జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ ద్వారా అపరిమిత 5జీ డేటాను కూడా వాడుకోవచ్చు.
వినోదంతోపాటు గేమింగ్ ప్రియులకు పండుగే..
ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో లభించే డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు. గేమింగ్ కోసం జియో గేమ్స్ మొబైల్, క్రీడాభిమానుల కోసం జియో టీవీ ద్వారా ఫ్యాన్‌కోడ్, సోషల్ మీడియా ప్రియుల కోసం స్నాప్‌చాట్+ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అదనంగా, మూడు నెలల కాలపరిమితి గల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్, జియో ఏఐ క్లౌడ్‌లో 50జీబీ ఉచిత స్టోరేజీని కూడా జియో అందిస్తోంది.
గూగుల్ జెమిని ప్రోతో భారీ ఆఫర్..
ఈ ప్లాన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం 'గూగుల్ జెమిని ప్రో' ఆఫర్. సుమారు రూ. 35,100 విలువైన ఈ సేవలను వినియోగదారులు 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇందులో అత్యాధునిక ఏఐ ఫీచర్లతో పాటు ఏకంగా 5టీబీ (5,000 జీబీ) క్లౌడ్ స్టోరేజీ లభిస్తుంది. అయితే, ఈ ప్రయోజనాలు కొనసాగాలంటే వినియోగదారులు తమ జియో నంబర్‌పై నిరంతరం ఏదో ఒక ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి.
అంతర్జాతీయ ప్రయాణికులకు మరో శుభవార్త..
విదేశాలకు వెళ్లే జియో వినియోగదారుల కోసం కూడా ఒక కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇకపై అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ లేకపోయినా, వై-ఫై కాలింగ్ ద్వారా ఎస్ఎంఎస్ సేవలను ఉచితంగా పొందవచ్చు. దీనివల్ల విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంకు ఓటీపీలు, ఇతర ముఖ్యమైన సందేశాలను ఎటువంటి అదనపు రుసుము లేకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది. దీని కోసం ఫోన్‌లో వై-ఫై కాలింగ్ సౌకర్యం ఎనేబుల్ చేసుకుని ఉండాలి.




