Harassment: ప్రమోషన్ కావాలా? కోరిక తీరుస్తావా?.. మత్తుమందు ఇచ్చి ఉద్యోగిపై లేడీ బాస్ అరాచకం

Harassment: ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ జేపిమోర్గాన్ చేజ్‌లో సీనియర్ మహిళా అధికారి తన జూనియర్ ఉద్యోగిని లైంగికంగా వేధించిందన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Naresh.k
Published on: 1 May 2026 9:30 AM IST
Harassment
X

Harassment: ప్రమోషన్ కావాలా? కోరిక తీరుస్తావా?.. మత్తుమందు ఇచ్చి ఉద్యోగిపై లేడీ బాస్ అరాచకం

JPMorgan: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాంకింగ్ సంస్థ జేపిమోర్గాన్ చేజ్ ఇప్పుడు ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. సాధారణంగా పని ఒత్తిడి, టార్గెట్ల గురించి వినే కార్పొరేట్ రంగంలో.. ఒక సీనియర్ మహిళా అధికారి తన జూనియర్ పురుష ఉద్యోగిని లైంగికంగా, మానసికంగా వేధించిందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

జాత్యహంకార వ్యాఖ్యలు

న్యూయార్క్ కౌంటీ సుప్రీం కోర్టులో దాఖలైన ఈ కేసు వివరాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బాధితుడి కథనం ప్రకారం.. 2024లో వీరిద్దరి మధ్య వృత్తిపరమైన పరిచయం ఏర్పడింది. అయితే అది త్వరగానే వేధింపుల పర్వంగా మారింది. బాధితుడు ఆమె అసభ్యకర కోరికలను, ఆహ్వానాలను తిరస్కరించడంతో.. నా మాట వినకపోతే నీ కెరీర్ మసి అయిపోతుంది అంటూ సదరు మహిళా బాస్ బెదిరింపులకు దిగిందట. పరిస్థితులు అంతటితో ఆగకుండా, మత్తుమందు ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది. కేవలం లైంగిక వేధింపులే కాకుండా, బాధితుడి కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేస్తూ జాత్యహంకార పదజాలంతో దూషించిందని దావాలో పేర్కొన్నారు.

పదోన్నతి కావాలా? కోరిక తీరుస్తావా?

కార్పొరేట్ రంగంలో అత్యంత కీలకమైన ప్రమోషన్లు, బోనస్‌లను ఆశ చూపి తన కోరికలు తీర్చుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్లు బాధితుడు వాపోతున్నాడు. వేధింపులు భరించలేక కంపెనీ యాజమాన్యానికి మొరపెట్టుకుంటే.. తనకు న్యాయం జరగకపోగా, రివర్స్‌లో తననే కంపెనీ సిస్టమ్స్ నుంచి తొలగించి సెలవుపై పంపారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

బ్యాంక్ వాదన ఏంటి?

ఈ ఆరోపణలను జేపిమోర్గాన్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత విచారణలో ఎటువంటి ఆధారాలు దొరకలేదని, అసలు ఫిర్యాదుదారుడు విచారణకు సహకరించలేదని జేపిమోర్గాన్ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణంగా మహిళలపై జరిగే వేధింపుల గురించి వినే సమాజానికి, ఈ కేసు ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఆఫీసుల్లో ఫిర్యాదుల వ్యవస్థలు ఎంతవరకు పారదర్శకంగా పనిచేస్తున్నాయి? బాధితుడు పురుషుడు అయినప్పుడు వ్యవస్థల స్పందన ఎలా ఉంటోంది? అన్న అంశాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పుతోనే ఈ అసలు నిజాలు బయటపడనున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story