LIC: అద్భుతమైన ప్లాన్.. ఒక్కసారి కడితే జీవితాంతం నెలకు రూ.11000
LIC: ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్‌తో మీ విశ్రాంత జీవితానికి 100% ఆర్థిక భద్రత లభిస్తుంది.
LIC: అద్భుతమైన ప్లాన్ ..ఒక్కసారి కడితే జీవితాంతం నెలకు రూ.11000
LIC New Jeevan Shanti : ఉద్యోగ విరమణ తర్వాత జీవితం ఎలా ఉంటుంది? శేష జీవితంలో ఎవరిపైనా ఆధారపడకుండా, సొంత కాళ్లపై గౌరవంగా బతకాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ వేధిస్తుంటాయి. మీ విశ్రాంత జీవితాన్ని అత్యంత సౌకర్యవంతంగా, వందకు వంద శాతం ఆర్థిక భద్రతతో మార్చేందుకు భారత ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన పెన్షన్ పాలసీని మన ముందుకు తెచ్చింది. అదే ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్. ఈ పాలసీలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. మీరు మీ జీవితంలో ఒక్కే ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, మీ జీవితాంతం ప్రతి నెలా స్థిరమైన హామీతో కూడిన రాబడిని పెన్షన్ రూపంలో అందుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీ జీవితకాల ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ సూపర్ పెన్షన్ పాలసీ విభిన్న కుటుంబ అవసరాలకు అనుగుణంగా రెండు రకాల ఆప్షన్లను అందిస్తోంది.
1. సింగిల్ లైఫ్ ప్లాన్:
ఈ విధానంలో మీరు పెట్టుబడి పెట్టే డబ్బు జీవితాంతం పెన్షన్ రూపంలో నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. ఒకవేళ పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణిస్తే, వారు పెట్టిన పెట్టుబడి మొత్తం ఎటువంటి నష్టం లేకుండా కుటుంబ సభ్యులకు లేదా నామినీకి క్షేమంగా తిరిగి ఇచ్చేస్తారు.
2. జాయింట్ లైఫ్ ప్లాన్:
ఇది ప్రత్యేకంగా పెళ్లైన జంటల కోసం రూపొందించిన అద్భుతమైన ప్లాన్. ఇందులో పెట్టుబడి పెడితే భార్యాభర్తలలో ఒకరు మరణించినప్పటికీ, జీవించి ఉన్న భాగస్వామికి ఏ ఆటంకం లేకుండా జీవితాంతం పింఛను అందుతూనే ఉంటుంది. ఆ తర్వాత వారిద్దరూ మరణించిన సందర్భంలో, అసలు పెట్టుబడి మొత్తం సురక్షితంగా వారి పిల్లలకు లేదా నామినీకి చేరుతుంది.
ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీ వయస్సు 45 సంవత్సరాలు అనుకుందాం. మీరు ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీలో సింగిల్ లైఫ్ ఆప్షన్‌ను ఎంచుకుని రూ. 10 లక్షలను ఒకేసారి జమ చేశారు. మీ పెట్టుబడి నుంచి 12 సంవత్సరాల తర్వాత పెన్షన్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే, మీకు 57 ఏళ్ల వయస్సు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏటా రూ. 1,42,500 వరకు రాబడి వస్తుంది. అంటే నెలవారీగా చూస్తే సుమారుగా రూ. 11,400 లభిస్తుంది. మీ చివరి శ్వాస వరకు ఈ డబ్బు వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మీ రూ. 10 లక్షల పెట్టుబడి కూడా మీ వారసులకు అందుతుంది.
ఒకవేళ దంపతులిద్దరూ కలిసి జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుని, ఇదే రూ. 10 లక్షల మొత్తాన్ని పెట్టుబడి పెడితే... 12 సంవత్సరాల కాలం తర్వాత సంవత్సరానికి రూ. 1,33,400 పింఛను వస్తుంది. దీని ప్రకారం చూస్తే నెల నెలా రూ. 10,672 చొప్పున భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్యంలో సమాన ఆర్థిక భద్రత లభిస్తుంది.
ఈ చారిత్రాత్మక పాలసీలో చేరడానికి ఎల్‌ఐసీ కొన్ని సులువైన నిబంధనలను ఉంచింది.కనీసం 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారి నుంచి గరిష్టంగా 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఎవరైనా ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ పథకంలో చేరడానికి కనీస పెట్టుబడిని రూ. 1,50,000 గా నిర్ణయించారు. దీని ద్వారా పాలసీదారునికి ఏడాదికి కనీసం రూ. 12,000 పెన్షన్ గ్యారెంటీగా వస్తుంది. ఇందులో గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితులు లేవు. మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వృద్ధాప్యంలో ఎవరి ముందూ చేయి చాపకుండా, ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయంతో మహారాజులా బతకాలనుకునే వారికి ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ ఒక వరం లాంటిదని చెప్పవచ్చు.




