LIC: అదరగొట్టిన ఎల్ఐసీ.. రూ.13,492 కోట్ల లాభం..కానీ అక్కడే తేడా కొట్టింది..!

LIC: ఎల్ఐసీ Q1 ఫలితాల్లో రూ. 13,492 కోట్ల నికర లాభంతో 23% వృద్ధి సాధించింది. 60.1% మార్కెట్ వాటాతో టాప్‌లో ఉన్నా, OFS కారణంతో షేరు ధర తగ్గుతోంది.

Naresh.k
Published on: 7 Aug 2026 9:25 AM IST
LIC
X

LIC: అదరగొట్టిన ఎల్ఐసీ.. రూ.13,492 కోట్ల లాభం..కానీ అక్కడే తేడా కొట్టింది..!

LIC Q1 Profit: ఎల్ఐసీ ఆర్థిక సంవత్సరం 2026-27 తొలి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలతో దూసుకెళ్లింది. స్థిరమైన ప్రీమియం ఆదాయం , నమ్మకమైన కస్టమర్ ఆధారంతో నికర లాభంలో 23% వృద్ధిని నమోదు చేసి, బీమా రంగంలో తన గుత్తాధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.10,987 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈ త్రైమాసికంలో రూ.13,492 కోట్లకు చేరింది. రూ.2.22 లక్షల కోట్ల నుంచి రూ.2.37,848 కోట్లకు పెరిగింది. రూ.2.11 లక్షల కోట్ల నుంచి రూ.2.25 లక్షల కోట్లకు పెరిగాయి.

రూ.7,525 కోట్ల నుంచి రూ.9,217 కోట్లకు వృద్ధి చెందింది. రూ.58,885 కోట్ల నుంచి రూ.61,883 కోట్లకు పెరిగింది. కొత్త పాలసీల విక్రయం ద్వారా రూ.56,369 కోట్లు సమకూరాయి. ఇండివిజువల్ సెగ్మెంట్‌లో మొత్తం 31.02 లక్షల పాలసీలను విక్రయించింది. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్లో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లలో ఎల్ఐసీ 60.1% మార్కెట్ వాటాతో తిరుగులేని అగ్రస్థానంలో కొనసాగుతోందని ఎల్ఐసీ ఎండీ ఆర్. దొరైస్వామి చెప్పుకొచ్చారు. ఆర్థిక ఫలితాలు అదరగొట్టినప్పటికీ, మార్కెట్‌లో ఎల్ఐసీ షేరు ధర ఒత్తిడికి గురవుతోంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాలను విక్రయించడం దీనికి ప్రధాన కారణం. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించినప్పటికీ, షేర్ల సరఫరా పెరగడంతో వరుస సెషన్లలో స్టాక్ ధర పడిపోతోంది. ఫండమెంటల్స్‌గా కంపెనీ వ్యాపారం ఎంతో బలంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ వాటాల విక్రయం వల్ల మార్కెట్‌లో ఏర్పడిన తాత్కాలిక సరఫరా షేరు ధరపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో ఈ స్థిరమైన లాభాలు ఇన్వెస్టర్లకు మళ్లీ భరోసానిచ్చే అవకాశం ఉంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story