Pension Scheme: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం నెలకు రూ. 20 వేల ఆదాయం
Pension Scheme: పదవీ విరమణ తర్వాత నెలనెలా కచ్చితమైన ఆదాయం ఉండాలనేది చాలా మంది కల.
Pension Scheme: ఒక్కసారి పెట్టుబడి పెడితే.. జీవితాంతం నెలకు రూ. 20 వేల ఆదాయం
Pension Scheme: పదవీ విరమణ తర్వాత నెలనెలా కచ్చితమైన ఆదాయం ఉండాలనేది చాలా మంది కల. మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన లేకుండా జీవితాంతం స్థిరమైన పెన్షన్ పొందాలనుకునే వారి కోసం భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) స్మార్ట్ పెన్షన్ స్కీమ్‌ను అందిస్తోంది.
ఒక్కసారి పెట్టుబడి.. వెంటనే పెన్షన్ ప్రారంభం
LIC స్మార్ట్ పెన్షన్ స్కీమ్ ఇమిడియట్ యాన్యుటీ (Immediate Annuity) విధానంలో పనిచేస్తుంది. అంటే పాలసీ తీసుకునే సమయంలో ఒకేసారి మొత్తం పెట్టుబడి చెల్లిస్తే, ఎంపిక చేసుకున్న పెన్షన్ విధానం ప్రకారం వెంటనే ఆదాయం రావడం ప్రారంభమవుతుంది. ఈ పథకం షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లతో ఎలాంటి సంబంధం ఉండదు. అందువల్ల మార్కెట్ ఒడిదొడుకుల ప్రభావం మీ పెన్షన్‌పై ఉండదు. పాలసీ ప్రారంభించిన రోజే భవిష్యత్తులో ఎంత పెన్షన్ వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది.
పెన్షన్ తీసుకునే విధానంలో పూర్తి స్వేచ్ఛ
ఈ స్కీమ్‌లో పెన్షన్‌ను మీ అవసరాలకు అనుగుణంగా ఎన్నో విధాలుగా పొందవచ్చు. ప్రతి నెల, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పాలసీని ఒక వ్యక్తి పేరిట మాత్రమే కాకుండా, భార్యాభర్తలు కలిసి కూడా తీసుకోవచ్చు. జాయింట్ లైఫ్ ఆప్షన్ ఎంచుకుంటే, ఒకరు మరణించిన తర్వాత కూడా మరో భాగస్వామికి జీవితాంతం పెన్షన్ కొనసాగుతుంది. దీంతో కుటుంబానికి దీర్ఘకాలిక ఆర్థిక భరోసా లభిస్తుంది.
నెలకు రూ.20 వేల పెన్షన్ రావాలంటే ఎంత పెట్టుబడి అవసరం?
ఈ స్కీమ్‌లో వచ్చే పెన్షన్ మొత్తం పెట్టుబడి, పాలసీ తీసుకునే సమయంలో ఉన్న వయస్సు, ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, సుమారు రూ.35 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, ఏడాదికి దాదాపు రూ.2.87 లక్షల వరకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నెలకు సగటున రూ.20,000 నుంచి రూ.23,000 వరకు ఆదాయం పొందవచ్చు. అదనంగా, కొన్ని యాన్యుటీ ఎంపికల్లో పాలసీదారుడు మరణించిన తర్వాత పెట్టుబడి చేసిన అసలు మొత్తాన్ని నామినీకి తిరిగి చెల్లించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.
పెట్టుబడి పరిమితి ఎంత? ఎవరు చేరవచ్చు?
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.1 లక్షగా నిర్ణయించారు. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. కాబట్టి తమ అవసరానికి అనుగుణంగా ఎక్కువ మొత్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టవచ్చు. రిటైర్‌మెంట్ ప్రయోజనాలుగా వచ్చిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్ (PF), రిటైర్మెంట్ కార్పస్ లేదా ఇతర పొదుపు మొత్తాన్ని భద్రంగా పెట్టుబడి పెట్టి స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.
ఈ స్కీమ్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది?
నెలనెలా ఖర్చులకు స్థిరమైన ఆదాయం అవసరమయ్యే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు, అలాగే పెద్ద మొత్తంలో పొదుపు ఉన్నవారు ఈ స్కీమ్‌ను పరిశీలించవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టే ముందు మీ వయస్సు, అవసరాలు, కుటుంబ పరిస్థితులు, అందుబాటులో ఉన్న యాన్యుటీ ఎంపికలు, రాబడి వివరాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. సమీప LIC శాఖ లేదా అధీకృత LIC ఏజెంట్‌ను సంప్రదించి తాజా యాన్యుటీ రేట్లు, అర్హత నిబంధనలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.




