Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా.? స్మార్ట్‌ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ (DL) వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ తప్పనిసరి డాక్యుమెంట్‌.

Mokshith
Published on: 25 July 2026 1:13 PM IST
Driving Licence
X

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా.? స్మార్ట్‌ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ (DL) వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ తప్పనిసరి డాక్యుమెంట్‌. అయితే కొన్నిసార్లు లైసెన్స్ పోవడం, చిరిగిపోవడం లేదా దానిపై ఉన్న వివరాలు స్పష్టంగా కనిపించకుండా పోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో కొత్త కార్డు వచ్చే వరకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. DigiLocker ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.

డిజిలాక‌ర్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ డౌన్‌లోడ్ చేసే విధానం

ముందుగా మీ మొబైల్‌లో డిజిలాక‌ర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి లేదా బ్రౌజర్‌లో డిజిలాక‌ర్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. తర్వాత.. మీ ఖాతాలో లాగిన్ అవ్వండి. సెర్చ్ బార్‌లో డ్రైవింగ్ లైసెన్స్‌ అని టైప్ చేయండి. మీ రాష్ట్ర రవాణా శాఖ (Transport Department)ను ఎంపిక చేసుకోండి. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ నమోదు చేయండి. వివరాలు ధృవీకరించిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్‌ విభాగంలో కనిపిస్తుంది.

అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.

డిజిలాక‌ర్‌లో ఉన్న DL చట్టబద్ధమేనా?

చాలామందికి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుందా అనే సందేహం ఉంటుంది. డిజిలాక‌ర్‌లో డౌన్‌లోడ్ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ రూపం మీ అసలు కార్డుతో కొంత భిన్నంగా కనిపించినా, అది చట్టబద్ధంగా పూర్తిగా చెల్లుబాటు అయ్యే పత్రం. ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేసినప్పుడు కూడా దీనిని చూపించవచ్చు.

వాట్సాప్ ద్వారా కూడా..

డిజిలాక‌ర్‌ యాప్ లేదా వెబ్‌సైట్ ఉపయోగించకూడదనుకుంటే, వాట్సాప్‌ ద్వారా కూడా డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా 9013151515 నంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేయండి. ఆ నంబర్‌కు "Hi" లేదా "Hello" అని మెసేజ్ పంపండి. వచ్చిన ఆప్షన్లలో డిజిలాక‌ర్ స‌ర్వీసెస్‌ను సెల‌క్ట్ చేయండి. సూచించిన వివరాలు నమోదు చేస్తే మీ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు.

డిజిటల్ లైసెన్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అసలు కార్డును ప్రతిసారీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. లైసెన్స్ పోయినా వెంటనే డిజిటల్ కాపీ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్‌లో చూపించవచ్చు.

ట్రాఫిక్ తనిఖీల సమయంలో చట్టబద్ధమైన పత్రంగా ఉపయోగించవచ్చు. అవసరమైనప్పుడు సులభంగా డౌన్‌లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అందువల్ల మీ డ్రైవింగ్ లైసెన్స్ పోయినా లేదా దెబ్బతిన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిజిలాక‌ర్‌ లేదా వాట్సాప్‌ సేవల ద్వారా కొన్ని నిమిషాల్లోనే డిజిటల్ కాపీని పొందవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story