LPG gas: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే మీకు గ్యాస్ బంద్
LPG gas: గ్యాస్ సిలిండర్లకు ఆధార్ కేవైసీ చేయకపోతే సబ్సిడీ ఆగిపోతుందా? గ్యాస్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంలో నిజమెంత?
LPG gas: ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. అలా చేయకపోతే మీకు గ్యాస్ బంద్
LPG gas: Aadhaar e-KYCఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతుందంటేనే గృహిణులకు ఒక టెన్షన్. ఇక ఇప్పుడు దానికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలతో గ్యాస్ వినియోగదారుల ఆందోళన మరింత పెరిగింది. అక్టోబర్ 1, 2026 నాటికి ఆధార్ కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ సిలిండర్లు ఆగిపోతాయి అనే ప్రచారంతో జనం గ్యాస్ ఏజెన్సీల చుట్టూ క్యూ కడుతున్నారు. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు చూద్దాం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు , పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిన వివరాల ప్రకారం.. సాధారణ గ్యాస్ వినియోగదారులకు ఆధార్ ఇ-కేవైసీ చేయకపోతే సిలిండర్ బుకింగ్ లేదా సరఫరా ఏ మాత్రం నిలిచిపోదు. ఈ విషయంలో వినియోగదారులు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
అయితే, కొన్ని ప్రత్యేక వర్గాల వారికి మాత్రం ఇది కచ్చితంగా వర్తిస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందినవారు, అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా సబ్సిడీ అందుకుంటున్నవారు తప్పనిసరిగా ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలి. వీరు కనుక కేవైసీ చేయించకపోతే, ప్రభుత్వం అందించే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉంది. అంటే, అప్పుడు సిలిండర్‌ను పూర్తి ధరకు (నాన్-సబ్సిడీ రేటుకు) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కమర్షియల్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నవారికి ఈ నిబంధనతో ఎలాంటి సంబంధం లేదు. వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ఒకే వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండడం, లేదా ఎప్పుడో మరణించిన వారి పేర్లపై ఇంకా సబ్సిడీని క్లెయిమ్ చేస్తుండడం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ డిజిటల్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. అర్హులైన నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వ సబ్సిడీ నేరుగా అందాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఆధార్ అథెంటికేషన్ కోసం గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు పలు సులభమైన మార్గాలను అందుబాటులోకి తెచ్చాయి. సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు, డెలివరీ సిబ్బంది వద్ద ఉండే మొబైల్ యాప్ లేదా పిన్-పాడ్ డివైజ్ ద్వారా అక్కడికక్కడే వేలిముద్ర లేదా ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు. ఇండియన్ ఆయిల్ వన్ , హెచ్‌పీ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ అధికారిక యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్ సాయంతో సెల్ఫీ ద్వారా ఇంట్లోనే ఉండి సులభంగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ రానివారు నేరుగా తమ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుకు వెళ్లి ఉచితంగా ఆధార్ అథెంటికేషన్ చేసుకోవచ్చు.




