Maggi: మ్యాగీ అమ్ముతూ రోజుకు రూ. 21 వేల సంపాదన.. సాఫ్ట్‌వేర్లు కూడా సరిపోరు కదా బాసూ
Maggi: ఆఫీసు పని ఒత్తిడితో విసిగిపోయారా? అయితే ఈ యువకుడి మ్యాగీ బిజినెస్ లెక్కలు చూడండి.
Maggi: మ్యాగీ అమ్ముతూ రోజుకు రూ. 21 వేల సంపాదన.. సాఫ్ట్‌వేర్లు కూడా సరిపోరు కదా బాసూ
Maggi Stall: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్ వంటి అందమైన పర్వత లోయల మధ్య రోడ్డు పక్కన ఒక యువకుడు చిన్న మ్యాగీ స్టాల్ నడుపుతున్నాడు. కేవలం నూడుల్స్ వండటమే కాదు, తన బిజినెస్ సీక్రెట్స్‌ను కూడా ఆ వీడియోలో పంచుకున్నాడు.
ఒక ప్లేట్ మ్యాగీ ధర రూ. 70. రోజువారీ అమ్మకాలు సుమారు 300 నుండి 350 ప్లేట్లు. అంటే ఒక్క రోజు సంపాదన సుమారుగా రూ. 21,000. ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నెలకు సంపాదించే మొత్తాన్ని ఈ యువకుడు కేవలం 24 గంటల్లోనే సంపాదిస్తున్నాడన్నమాట. ఈ లెక్కలు చూశాక నెటిజన్లు ఊరుకుంటారా? బాస్.. రేపే నా రాజీనామా లేఖ ఇచ్చేస్తున్నా, నేను కూడా పర్వతాలకు వెళ్ళిపోతున్నా అంటూ ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
రోజుకు రూ. 21 వేలు అంటే నెలకు లక్షల్లో ఆదాయం అని మనం సంబరపడిపోవచ్చు. కానీ, ఈ గ్లామరస్ సంపాదన వెనుక గడ్డకట్టే కష్టం కూడా ఉంది. పర్యాటకుల రద్దీ ఉన్నప్పుడు మాత్రమే ఈ స్థాయి అమ్మకాలు ఉంటాయి. ఆఫ్-సీజన్‌లో బోణీ అవ్వడం కూడా గగనమే. వేల అడుగుల ఎత్తులో ఉన్న స్టాల్‌కి మ్యాగీ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, కూరగాయలు మోసుకురావడం సామాన్యమైన విషయం కాదు. గడ్డకట్టే చలి, అకస్మాత్తుగా కురిసే మంచు, వర్షాల మధ్య గంటల తరబడి నిలబడి వంట చేయడం పెద్ద సాహసమే.
ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మనం అనవసరంగా డిగ్రీలు పట్టుకుని ఆఫీసుల్లో ఫైళ్లతో కుస్తీ పడుతున్నాం.. ఈ బిజినెస్ ఐడియా ఏదో బాగుంది కదా అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం, రూ. 21 వేలు అనేది టర్నోవర్ మాత్రమే.. అందులో సరుకుల ఖర్చు, గ్యాస్, శ్రమ తీసేస్తే మిగిలేది వేరే ఉంటుంది అంటూ విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా, ఏ పని చేసినా అందులో క్రియేటివిటీ, కష్టం ఉంటే విజయం వరిస్తుందని ఈ యువకుడు నిరూపించాడు. ఐటీ ఉద్యోగాల ఒత్తిడిలో ఉన్నవారికి మాత్రం ఈ మ్యాగీ బిజినెస్ ఒక కలల ప్రాజెక్టుగా కనిపిస్తోంది.




