IPO: స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల జోరు.. ఈ వారంలోనే రూ. 7,055 కోట్లతో కంపెనీలు క్యూ..!
IPO: సెప్టెంబర్ 7 నుండి రెంటొమోజో, ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ వంటి 11 మెయిన్ బోర్డ్ కంపెనీలు ఐపీఓ ద్వారా రూ. 7,055 కోట్లు సమీకరించనున్నాయి.
IPO: స్టాక్ మార్కెట్‌లో ఐపీఓల జోరు.. ఈ వారంలోనే రూ. 7,055 కోట్లతో కంపెనీలు క్యూ..!
Indian IPO Market: భారత ఈక్విటీ మార్కెట్ ప్రైమరీ విభాగంలో మళ్లీ ఐపీఓల పండగ మొదలైంది. సెప్టెంబర్ 7 నుండి 15 మధ్యకాలంలో ప్రముఖ ఆన్‌లైన్ రెంటల్ ప్లాట్‌ఫామ్ ‘రెంటొమోజో’, ‘కరంతారా ఇంజనీరింగ్’, ‘కనోహర్ ఎలక్ట్రికల్స్’ సహా మొత్తం 11 మెయిన్ బోర్డ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలు మార్కెట్ నుంచి ఉమ్మడిగా రూ. 7,055 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
వేగంగా ఎదుగుతున్న ఈ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ కంపెనీల్లో వాటాలు దక్కించుకునేందుకు ఇన్వెస్టర్లు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రియల్ ఎస్టేట్, తయారీ రంగం, స్పెషాలిటీ కెమికల్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి విభిన్న రంగాలకు చెందిన ఈ సంస్థల ఎంట్రీతో ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన మొత్తం ఐపీఓల సంఖ్య 75కు చేరడం విశేషం.
ఈ సేకరిస్తున్న రూ. 7,055 కోట్ల నిధులలో.. రూ. 2,722 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా నేరుగా కంపెనీల ఖాతాల్లోకి వెళ్లి వ్యాపార విస్తరణకు ఉపయోగపడతాయి. రూ. 4,333 కోట్లు పాత వాటాదారులు, ప్రమోటర్లకు చెందుతాయి. కంపెనీలు ఈ నిధులను తమ వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, అప్పుల చెల్లింలు మరియు రోజువారీ నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించనున్నాయి.
సెప్టెంబర్ 7న ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ ఇష్యూతో ఈ ఐపీఓల హోరు ప్రారంభం కానుంది.ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ రూ. 351 కోట్లు, రెంటొమోజో రూ. 1,256 కోట్లు, కనోహర్ ఎలక్ట్రికల్స్ రూ. 1,056 కోట్లు, కరంతారా ఇంజనీరింగ్ రూ. 875 కోట్లు, ప్రసోల్ కెమికల్స్ రూ. 500 కోట్లు ఐపీఓ రంగంలో పెట్టనున్నాయి.
వైవిధ్యమైన రంగాలు, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో వస్తున్న ఈ ఐపీఓలు ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ లాభాలతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలను అందించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




