Uber & Rapido: ఉబర్, రాపిడోలకు బిగ్ షాక్ .. లైసెన్సులు సస్పెండ్
Uber & Rapido: చండీగఢ్‌లో ఉబర్, రాపిడో సంస్థల లైసెన్సులను STA 6 నెలల పాటు సస్పెండ్ చేసింది.
Uber & Rapido: ఉబర్, రాపిడోలకు బిగ్ షాక్ .. లైసెన్సులు సస్పెండ్
Uber & Rapido: రైడ్-హెయిలింగ్ దిగ్గజాలు ఉబర్ , రాపిడో లకు ఊహించని షాక్ తగిలింది. చండీగఢ్ పరిధిలో ఈ రెండు ప్రముఖ యాప్ ఆధారిత రవాణా సంస్థల అగ్రిగేటర్ లైసెన్సులను స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఏకంగా 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అగ్రిగేటర్ పాలసీ-2025లోని కీలక నిబంధనలను పాటించడంలో ఈ సంస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. డ్రైవర్లకు అందించాల్సిన ఆరోగ్య బీమా , టర్మ్ ఇన్సూరెన్స్, అవసరమైన శిక్షణా తరగతులు, పారదర్శక ఛార్జీల విధానం వంటి ప్రాథమిక బాధ్యతలను విస్మరించాయి.
నిబంధనల అమలుపై యంత్రాంగం పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, కంపెనీల నుంచి సరైన పత్రాలు లేదా బాధ్యతాయుతమైన రెస్పాన్స్ రాకపోవడంతో అధికార యంత్రాంగం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
లైసెన్సుల సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి రావడంతో రాబోయే ఆరు నెలల పాటు చండీగఢ్‌లో ఉబర్, రాపిడో సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. నిత్యం ఈ యాప్‌లపైనే ఆధారపడే వేలాది మంది ప్రయాణికులకు రాకపోకల తిప్పలు తప్పవు.
అంతేకాకుండా, వీటిపైనే జీవనోపాధి పొందుతున్న వేలాది మంది క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్ల ఆదాయంపై ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీయనుంది. రూల్స్ పాటించకపోతే ఎంతటి పెద్ద కంపెనీలైనా చర్యలు తప్పవని చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఈ నిర్ణయంతో స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.




