Financial changes: సెప్టెంబర్ 1, 2026 నుండి అమలులోకి రానున్న కీలక ఆర్థిక మార్పులు.

Financial changes: నెల మారేకొద్దీ కేవలం క్యాలెండర్ పుటలు మాత్రమే మారవు, మన జేబుపై ప్రభావం చూపే కీలక ఆర్థిక నిబంధనలు కూడా మారతాయి.

Gagan kumar
Published on: 31 Aug 2026 8:42 AM IST
Financial changes
X

Financial changes: సెప్టెంబర్ 1, 2026 నుండి అమలులోకి రానున్న కీలక ఆర్థిక మార్పులు.

Financial changes: నెల మారేకొద్దీ కేవలం క్యాలెండర్ పుటలు మాత్రమే మారవు, మన జేబుపై ప్రభావం చూపే కీలక ఆర్థిక నిబంధనలు కూడా మారతాయి. ఆగస్టు ముగిసి, సెప్టెంబర్ 1, 2026లోకి అడుగుపెడుతున్న వేళ సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు ఇవే. ఈ గడువులు, నిబంధనలపై అవగాహన లేకపోతే జరిమానాలు కట్టాల్సి రావచ్చు.

ఎల్‌పీజీ గ్యాస్

ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా సెప్టెంబర్ 1న గృహ వినియోగ, వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు విమాన ఇంధన ధరలను కూడా సమీక్షించనున్నారు.

గ్యాస్ ఈ-కేవైసీ

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయడానికి ఆగస్టు 31ని ఆఖరి తేదీగా నిర్ణయించాయి. సెప్టెంబర్ 1 నాటికి కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ ఆగిపోవడంతో పాటు సిలిండర్ డెలివరీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

బ్యాంకింగ్ సేవలు

కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ సేవల రుసుములు, ఏటీఎం ఉచిత విత్‌డ్రాయల్ పరిమితులు, ఛార్జీలను సెప్టెంబర్ 1 నుంచి సవరించే యోచనలో ఉన్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు సవరణలు చేయగా, మిగిలిన బ్యాంకులు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.

డిపాజిట్ నిబంధనలు

రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు ప్రచురించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని బ్రాంచుల్లో ఒకే రకమైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉండేలా చూసే ఈ నూతన నిబంధనలు అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి.

ఐటీ రిటర్న్స్

ఫైనాన్స్ యాక్ట్ 2026 ప్రకారం నాన్-ఆడిట్ వ్యాపారులు, నిపుణులు , ఫ్రీలాన్సర్లు ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి ఆగస్టు 31 చివరి తేదీ. సెప్టెంబర్ 1 నుంచి ఫైల్ చేసేవారు ఆలస్య రుసుము కింద రూ.1,000 నుండి రూ.5,000 వరకు పెనాల్టీలతో పాటు పన్ను బకాయిలపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, ఎలాంటి పెనాల్టీల బారిన పడకుండా ఉండాలంటే వెంటనే మీ కేవైసీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియలను పూర్తి చేసుకోవడం మంచిది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story