New E-Commerce Rules: నకిలీ డిస్కౌంట్లు, డార్క్ ప్యాటర్న్‌లకు చెక్: కేంద్రం కొత్త ఇ-కామర్స్ నిబంధనలు!

New E-Commerce Rules: డార్క్ ప్యాటర్న్లు, నకిలీ డిస్కౌంట్లను అరికట్టేందుకు ఇ-కామర్స్ సవరణ నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 9:05 AM IST
New E-Commerce Rules
X

New E-Commerce Rules: నకిలీ డిస్కౌంట్లు, డార్క్ ప్యాటర్న్‌లకు చెక్: కేంద్రం కొత్త ఇ-కామర్స్ నిబంధనలు!

New E-Commerce Rules: ఆన్‌లైన్ షాపింగ్‌లో నకిలీ డిస్కౌంట్లు, డార్క్ ప్యాటర్న్లు మరియు తప్పుదోవ పట్టించే సెర్చ్ ఫలితాల ద్వారా వినియోగదారులను బురిడీ కొట్టించే విధానాలకు స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ 'వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) నిబంధనలు, 2020' నిబంధనలను సవరిస్తూ 'వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) (సవరణ) నిబంధనలు, 2026'ను తీసుకొచ్చింది. ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం... ఇ-కామర్స్ సంస్థలు డిస్కౌంట్లు ప్రకటించేటప్పుడు తగ్గించిన ధరతో పాటు, ఆఫర్‌కు ముందు 30 రోజులలో సదరు వస్తువుకు ఉన్న అత్యల్ప 'మునుపటి ధర'ను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఆన్‌లైన్ సెర్చ్ ఫలితాలను కావాలని మార్చడాన్ని నిషేధించడమే కాకుండా, స్పాన్సర్డ్ ఉత్పత్తులపై 'అడ్వర్టైజ్‌మెంట్' ట్యాగ్‌ను స్పష్టంగా చూపించాలి. అంతేకాకుండా, డార్క్ ప్యాటర్న్‌లను నియంత్రిస్తూ ప్లాట్‌ఫామ్‌లు ఏటా స్వీయ-ఆడిట్ (Self-Audit) నిర్వహించి సర్టిఫికేట్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది.

కాగా, 2025లో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు (NCH) వచ్చిన మొత్తం ఫిర్యాదులలో ఏకంగా 29 శాతం (5,11,196) ఇ-కామర్స్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వినియోగదారుల ఫిర్యాదు కాపీని వెంటనే వారికి అందజేయడం, వస్తువు ముగింపు తేదీ (Expiry Date), తయారైన దేశం, రీఫండ్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించడం మరియు కస్టమర్ల అనుమతి లేకుండా డేటాను ఉపయోగించకూడదని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story