Gold: కొత్త గోల్డ్ స్కీం.. ఇకపై జ్యూవలరీ షాప్‌లలో కూడా డిపాజిట్

Gold: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్'లో భారీ మార్పులు జరగనున్నాయి. ఇన్నాళ్లూ కేవలం బ్యాంకులకే పరిమితమైన ఈ స్కీమ్‌ను మరింత సులభతరం.

Ravi
By Ravi
Published on: 4 July 2026 7:01 AM IST
Gold
X

Gold: కొత్త గోల్డ్ స్కీం.. ఇకపై జ్యూవలరీ షాప్‌లలో కూడా డిపాజిట్

Gold: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్'లో భారీ మార్పులు జరగనున్నాయి. ఇన్నాళ్లూ కేవలం బ్యాంకులకే పరిమితమైన ఈ స్కీమ్‌ను మరింత సులభతరం చేస్తూ, ఇకపై నేరుగా జువెలర్స్ వద్దే బంగారాన్ని డిపాజిట్ చేసే అవకాశాన్ని తీసుకురానున్న ఆ సరికొత్త స్కీమ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మన దేశంలో ప్రజలకు బంగారంపై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత బంగారం ఖచ్చితంగా ఉంటుంది. అయితే, ఇళ్లలో లేదా లాకర్లలో ఊరికే పడి ఉండే ఆ భౌతిక బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గతంలో 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎవరైనా తమ బంగారాన్ని నిర్దేశిత బ్యాంకుల్లో డిపాజిట్ చేసి, ఆ మొత్తంపై కొంత వడ్డీని పొందవచ్చు. కానీ, ఇప్పుడు ఆ స్కీమ్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కేంద్రం సన్నద్ధమైంది.

కేంద్ర ప్రభుత్వం ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో కొన్ని కీలక మార్పులు చేసి రాబోయే రెండు వారాల్లో ఒక సరికొత్త స్కీమ్‌ను లాంచ్ చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గతంలో తమ బంగారాన్ని కేవలం బ్యాంకుల దగ్గర మాత్రమే డిపాజిట్ చేయాల్సి వచ్చేది. కానీ రాబోయే ఈ కొత్త స్కీమ్ ద్వారా, ప్రజలు ఇకపై తమకు నమ్మకమైన లేదా గుర్తింపు పొందిన జువెలర్స్ వద్ద కూడా నేరుగా తమ బంగారాన్ని డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుందట.

ఈ నిర్ణయం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం పెరిగి, ఎక్కువ మంది తమ ఇళ్లలోని బంగారాన్ని ఈ పథకంలోకి తీసుకువస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం, మన దేశంలోని ప్రజల ఇళ్లలో ఉన్న మొత్తం బంగారంలో కనీసం 5 శాతం బంగారాన్ని ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేసినా సరే, ఏకంగా రూ. 8.58 లక్షల కోట్లు సమకూరుతాయని అంచనా. ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు తమ బంగారంపై సురక్షితమైన ఆదాయం లభించడంతో పాటుగా, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ ఊతం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త గోల్డ్ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి విధివిధానాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story