New Rules: నేటి నుంచే కొత్త రూల్స్.. సామాన్యుల జేబుకు చిల్లు
New Rules: మే , 2026 నుంచి భారత దేశంలో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
New Rules: నేటి నుంచే కొత్త రూల్స్.. సామాన్యుల జేబుకు చిల్లు
KYC: మే, 2026... క్యాలెండర్ మీద ఇది కేవలం ఒక కొత్త నెల ప్రారంభం మాత్రమే కాదు, దేశ ఆర్థిక , డిజిటల్ వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు సామాన్యుడి జేబు నుంచి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేయనున్నాయి.
ఆన్లైన్ గేమింగ్‌కు చెక్
డిజిటల్ ప్రపంచంలో యువతను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ గేమింగ్ వ్యసనానికి, మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. నేటి నుంచి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా తన ప్రతాపాన్ని చూపనుంది. ఏది కేవలం వినోదం కోసం? ఏది డబ్బుల కోసం? అనేది ఇక స్పష్టంగా తెలియాల్సిందే. పిల్లలు ఎంతసేపు ఆడుతున్నారు? ఏ వయస్సు వారు ఆడుతున్నారు? అనే విషయాలపై కంపెనీలకు కచ్చితమైన బాధ్యతను అప్పగించింది. ఆఫీసు అమెరికాలో ఉన్నా, సింగపూర్‌లో ఉన్నా.. భారత్‌లో సేవలు అందిస్తే మాత్రం ఇక్కడి చట్టాలకు తలవంచాల్సిందే. దీనివల్ల మన డేటా , డబ్బు విదేశాలకు అక్రమంగా తరలిపోకుండా గట్టి భద్రత లభించనుంది.
వంటగ్యాస్ కనెక్షన్..
ప్రతి నెలలాగే ఈ మే నెలలో కూడా గ్యాస్ ధరల్లో మార్పులు ఉండబోతున్నాయి. అయితే ఈసారి ధరల కంటే నిబంధనల మీదే వినియోగదారులు దృష్టి పెట్టాలి. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మీ గ్యాస్ కనెక్షన్‌కు కేవైసీ పూర్తి కాకపోతే, సిలిండర్ డెలివరీలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా అర్హులకు చేరాలనేదే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు కావాలంటే..?
ఎస్బీఐ కార్డు వాడుతున్న వారికి నేటి నుంచి కొత్త ఛార్జీల మోత మొదలైంది. ముఖ్యంగా లేట్ పేమెంట్ ఛార్జీల్లో మార్పులు వచ్చాయి.రూ. 500 లోపు బకాయిలపై ఆలస్య రుసుము ఇకపై రూ. 100 గా ఉంటుంది. రూ. 501 నుంచి రూ. 1,000 మధ్య ఉన్న బకాయిలకు ఏకంగా రూ. 500 పెనాల్టీ పడనుంది. ఇంతకుముందు రూ. 50,000 ఖర్చు చేస్తే యాన్యువల్ ఛార్జీ మాఫీ అయ్యేది, కానీ నేటి నుంచి ఆ పరిమితిని రూ. 1,00,000కి పెంచారు. అంటే, మాఫీ పొందాలంటే ఇకపై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులన్నీ మొదటి చూపులో కాస్త ఇబ్బందిగా అనిపించినా, దీర్ఘకాలంలో ఇవి వినియోగదారుల భద్రతను పెంచుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైబర్ నేరాల నుంచి రక్షణ పొందాలన్నా, ప్రభుత్వ ఫలాలు నేరుగా అందాలన్నా ఇలాంటి కఠిన నిబంధనలు అవసరమే.




