New Rules: సామాన్యులకు అలర్ట్: జూన్ 1వ తేదీ నుంచి మారనున్న 5 ముఖ్యమైన నియమాలు.. జేబుకు చిల్లేనా?
New Rules: జూన్ 1వ తేదీ నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే ఐదు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి.
New Rules: సామాన్యులకు అలర్ట్: జూన్ 1వ తేదీ నుంచి మారనున్న 5 ముఖ్యమైన నియమాలు.. జేబుకు చిల్లేనా?
New Rules: సాధారణంగా ప్రతి నెల మొదటి రోజు దేశంలో కొన్ని ముఖ్యమైన ఆర్థికపరమైన మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొత్త నిబంధనల అమలు వల్ల వీటి ప్రభావం నేరుగా లేదా పరోక్షంగా సామాన్య ప్రజలపై పడుతుంది. ఈ క్రమంలోనే రాబోయే జూన్ 1వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు, యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థ, ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, పాన్ కార్డ్ మరియు సోలార్ ప్యానెల్ నిబంధనల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. ఆ వివరాలు ఇవే..
1. ఎల్‌పీజీ, సీఎన్‌జీ గ్యాస్ ధరల సవరణ
ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు (IOCL, BPCL, HPCL) ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు సీఎన్‌జీ (CNG), పీఎన్‌జీ (PNG) ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా జూన్ 1న గృహ అవసరాల గ్యాస్ లేదా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనేది తెలియనుంది.
2. యూపీఐ (UPI) లావాదేవీల్లో కొత్త భద్రతా రూల్స్
ఆన్‌లైన్ యూపీఐ మోసాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సరికొత్త నిబంధన తీసుకురానుంది.
లబ్ధిదారుడి అసలు పేరు: జూన్ చివరి (జూన్ 30) నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న ఈ విధానం ప్రకారం.. మీరు ఎవరికైనా క్యూఆర్ కోడ్ (QR Code) లేదా మొబైల్ నెంబర్ ద్వారా డబ్బులు పంపే ముందే బ్యాంక్ రికార్డుల్లో ఉన్న సదరు లబ్ధిదారుడి అసలైన పేరు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల తప్పుడు నెంబర్లకు డబ్బులు వెళ్లకుండా ఆపవచ్చు.
3. పాన్ కార్డ్ (PAN Card) కఠిన నిబంధనలు
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసే వారికి జూన్ 1 నుంచి నిబంధనలు కఠినతరం కానున్నాయి.
నగదు డిపాజిట్లు: బ్యాంకుల్లో ఒకే రోజులో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసే వారిపై నిఘా పెరగనుంది.
వ్యాపారులకు షాక్: ఇళ్లలో విగ్రహాలు (Idols) తయారు చేసే వ్యాపారుల టర్నోవర్ రూ.10 లక్షలు దాటితే వారికి పాన్ కార్డ్ తప్పనిసరి చేస్తూ కొత్త రూల్స్ తీసుకువచ్చారు.
4. ఏటీఎం (ATM) ఛార్జీల బాదుడు
మీరు ఏటీఎంల ద్వారా తరచూ డబ్బులు విత్‌డ్రా చేస్తుంటే జూన్ 1 నుంచి అప్రమత్తంగా ఉండాలి. కొన్ని ప్రముఖ బ్యాంకులు తమ ఏటీఎం విత్‌డ్రాయల్ లావాదేవీల ఛార్జీలను పెంచడానికి సిద్ధమయ్యాయి. అలాగే ప్రతి నెల ఇచ్చే ఉచిత ట్రాన్సాక్షన్ల లిమిట్ (Free Transaction Limits) లో కూడా మార్పులు రానున్నాయి. పరిమితి దాటితే అదనపు బాదుడు తప్పదు.
5. సోలార్ ప్యానెల్ ధరలు పెరిగే ఛాన్స్!
ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కూడా కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులు, సబ్సిడీ మరియు నెట్ మీటరింగ్ ప్రాజెక్టులలో ఇకపై కచ్చితంగా ALMM (Approved List of Models and Manufacturers) లిస్ట్-I, లిస్ట్-II కింద ఆమోదించిన మాడ్యూల్స్ మాత్రమే వాడాలి. జూన్ 1 తర్వాత దీనికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఈ నిబంధనల వల్ల సోలార్ ప్యానెల్స్ ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.




