NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలా.? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి

NPS Vatsalya: పిల్లల భవిష్యత్తు కోసం చిన్న మొత్తంతోనే పెద్ద సేవింగ్స్ ప్రారంభించాలనుకునే వారికి NPS వాత్సల్య స్కీమ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు.

Mokshith
Published on: 16 April 2026 2:25 PM IST
NPS Vatsalya
X

NPS Vatsalya: మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలా.? ఈరోజే ఈ ప‌ని మొద‌లు పెట్టండి

NPS Vatsalya: పిల్లల భవిష్యత్తు కోసం చిన్న మొత్తంతోనే పెద్ద సేవింగ్స్ ప్రారంభించాలనుకునే వారికి NPS వాత్సల్య స్కీమ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. దీర్ఘకాలికంగా డబ్బు పెంచుకునేలా రూపొందించిన ఈ పథకంలో క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే మంచి ఫలితాలు పొందొచ్చు.

చిన్న మొత్తంతోనే ప్రారంభం

ఈ స్కీమ్‌లో సంవత్సరానికి కేవలం రూ. 250తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. గ‌రిష్టంగా ఎంతైనా పెట్టొచ్చు. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ కాలం డబ్బు పెరుగుతుంది. కంపౌండింగ్ వల్ల దీర్ఘకాలంలో మంచి మొత్తంగా మారే అవకాశం ఉంటుంది.

8 ఏళ్ల తర్వాత NPS అకౌంట్‌గా మారుతుంది

పిల్లవాడు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ఈ అకౌంట్ ఆటోమేటిక్‌గా రెగ్యులర్ NPS (Tier-1) అకౌంట్‌గా మారుతుంది. కొత్తగా అకౌంట్ తెరవాల్సిన అవసరం ఉండదు. ఇదే కొనసాగుతూ డబ్బు పెరుగుతూనే ఉంటుంది.

పెట్టుబడిపై నియంత్రణ, ఉపసంహరణ సౌకర్యం

18 ఏళ్లకు ముందుగా గరిష్టంగా 2 సార్లు మాత్రమే డబ్బు తీసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత 25% వరకు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది (విద్య, వైద్యం వంటి అవసరాలకు). 18–21 సంవత్సరాల మధ్య 20% వరకు తీసుకోవచ్చు, మిగతా మొత్తం పెన్షన్ ప్లాన్‌లోకి వెళుతుంది.

పూర్తి ఉపసంహరణకు నిబంధనలు

మొత్తం డబ్బు రూ. 8 లక్షల లోపు ఉంటే పూర్తిగా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అయితే కొంత భాగం తప్పనిసరిగా పెన్షన్ కోసం పెట్టాలి. ఇది భవిష్యత్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది.

ఎక్కువ రాబడికి ఈక్విటీ ఆప్షన్

ఈ స్కీమ్‌లో 75% వరకు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది ఎక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో పెట్టుబడిపై క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. ఈ అకౌంట్‌ను తల్లిదండ్రులు నిర్వహించినా, డబ్బు పూర్తిగా పిల్లలదే. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇందులో డబ్బు జమ చేయవచ్చు.

మొత్తం మీద NPS వాత్సల్య స్కీమ్ అనేది పిల్లల భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది వేసే ప్లాన్. చిన్న మొత్తంతో ప్రారంభించి, ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మంచి సంపద సృష్టించుకోవచ్చు.

అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి.?

* ముందుగా అధికారిక eNPS పోర్టల్ సందర్శించి 'NPS Vatsalya' సెక్షన్‌పై క్లిక్ చేయండి.

* తల్లిదండ్రుల ఆధార్ లేదా డిజీలాకర్ ద్వారా కేవైసీ (KYC) పూర్తి చేయండి.

* పిల్లల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, కావాల్సిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.

* కనీసం రూ. 1,000 తొలి పెట్టుబడిగా చెల్లించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

* సక్సెస్‌ఫుల్ సబ్మిషన్ తర్వాత, పిల్లల పేరు మీద ఒక ప్రత్యేక PRAN నంబర్ జనరేట్ అవుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story