NSE IPO Listing: లిస్టింగ్‌కు ముందే పడిపోయిన NSE GMP.. ఇన్వెస్టర్లకు నిరాశేనా?

నేడే NSE IPO లిస్టింగ్. గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 43కి పడిపోవడంతో 2.41% లాభాల అంచనా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 Sept 2026 5:37 AM IST
NSE IPO Listing
X

NSE IPO Listing: లిస్టింగ్‌కు ముందే పడిపోయిన NSE GMP.. ఇన్వెస్టర్లకు నిరాశేనా?

NSE IPO Listing: ఈరోజే (సెప్టెంబర్ 24) దేశీయ స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టబోతున్న ఎన్‌ఎస్ఈ (NSE) ఐపీఓకు గ్రే మార్కెట్‌లో ఊహించని షాక్ తగిలింది. లిస్టింగ్‌కు సరిగ్గా ముందే దీని గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) భారీగా పడిపోయింది. బుధవారం నాటికి మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం GMP ప్రీమియం షేరుకు రూ. 43 స్థాయికి క్షీణించింది.

ప్రస్తుతం నమోదైన జీఎమ్‌పీ లెక్కల ప్రకారం NSE షేర్లు రూ. 1,828 వద్ద లిస్ట్ అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇది అప్పర్ ప్రైస్ బ్యాండ్ అయిన రూ. 1,785తో పోలిస్తే కేవలం 2.41 శాతం స్వల్ప ప్రీమియం మాత్రమే. ఇష్యూ ప్రారంభంలో జీఎమ్‌పీ రూ. 145 (సుమారు 8 శాతానికి పైగా లాభం) వరకు పలికినప్పటికీ, మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడంతో లిస్టింగ్ నాటికి బూస్ట్ తగ్గింది. ఈ ఐపీఓ షేర్లు ఈరోజు బీఎస్‌ఈ (BSE)లో లిస్ట్ కానున్నాయి.

మొత్తంగా రూ. 22,568.94 కోట్ల విలువైన ఈ మెగా పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 17 నుండి 21 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంది. ఓవరాల్‌గా ఈ ఇష్యూ 5.71 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అందుబాటులో ఉన్న 8.86 కోట్ల షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్ల షేర్లకు రూ. 90,287 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. విభాగాలు వారీగా చూస్తే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) కేటగిరీ 12.68 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NII) 6.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 1.39 రెట్ల సబ్‌స్క్రిప్షన్ నమోదు చేశారు.

ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 1,700 - రూ. 1,785గా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో జరిగింది. కాగా, NSE ప్రధాన ఆదాయం లావాదేవీల ఛార్జీల (Transaction Charges) నుంచే వస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన మొత్తం నిర్వహణ ఆదాయంలో 78.65 శాతం ఈ ఛార్జీల నుంచే రాగా, అందులోనూ ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారానే 60 శాతానికి పైగా వాటా లభించడం విశేషం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్