NSE IPO: రూ.22,569 కోట్లతో రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్ఎస్ఈ!

NSE IPO: ఎన్ఎస్ఈ ఐపీఓ సెప్టెంబర్ 17న ప్రారంభం. షేరు ధరల శ్రేణి రూ. 1,700-1,785గా నిర్ణయించినట్లు ఎన్ఎస్ఈ ప్రకటించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 5:00 AM IST
NSE IPO
X

NSE IPO: రూ.22,569 కోట్లతో రెండో అతిపెద్ద ఐపీఓగా ఎన్ఎస్ఈ!

NSE IPO: దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం 'నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్' (NSE) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ప్రైస్ బ్యాండ్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 17న ప్రారంభమై సెప్టెంబర్ 21న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ సెప్టెంబర్ 16న జరగనుంది.

ఈ ఐపీఓ ద్వారా ఎన్ఎస్ఈ ఏకంగా రూ. 22,569 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటార్ ఇండియా (రూ. 27,870 కోట్లు) ఆఫరింగ్ తర్వాత, భారత కార్పొరేట్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. గతంలో ఎల్‌ఐసీ సాధించిన రూ. 21,000 కోట్ల రికార్డును ఈ ఇష్యూ అధిగమించనుంది. దాదాపు దశాబ్ద కాలంగా నిలిచిపోయిన నియంత్రణపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో సెప్టెంబర్ 24న ఎన్ఎస్ఈ షేర్లు మార్కెట్‌లో లిస్ట్ కానున్నాయి.

ఈ ఇష్యూ పూర్తిగా 'ఆఫర్ ఫర్ సేల్' (OFS) రూపంలో ఉండనుండగా, ప్రస్తుత వాటాదారులు 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. అర్హులైన సంస్థ ఉద్యోగుల కోసం రూ. 70 కోట్ల విలువైన షేర్లను కేటాయించగా, వారికి ఒక్కో షేరుపై రూ. 170 తగ్గింపు (Discount) లభిస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్