Amazon Prime Day Sale: వన్‌ప్లస్ ప్రైమ్ డే ఆఫర్లు.. కంప్లీట్ డీటెయిల్స్ ఇవే.!

Amazon Prime Day Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో జరగబోయే అమెజాన్ ప్రైమ్ డే

G Krishna
Published on: 30 Jun 2026 1:24 PM IST
amazon prime day sale offers
X

amazon prime day sale offers

Amazon Prime Day Sale: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో జరగబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. జూలై 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు రోజుల సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై భారీగా ధరలు తగ్గనున్నాయి. డైరెక్ట్ డిస్కౌంట్లతో పాటు ఇన్స్టంట్ బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు , ఉచిత యాక్సెసరీస్ వంటి ఎన్నో బెనిఫిట్స్ ఈ సేల్‌లో లభించనున్నాయి.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

వన్‌ప్లస్ కంపెనీకి చెందిన ప్రీమియం , ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఈ సేల్‌లో కళ్ళు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. కంపెనీ టాప్ ఎండ్ మోడల్ వన్‌ప్లస్ 15 (OnePlus 15) ఫోన్‌ను రూ. 4,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 81,999 లారవడి ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే వన్‌ప్లస్ 15R (OnePlus 15R) మోడల్‌పై ఏకంగా రూ. 3,000 డైరెక్ట్ ప్రైస్ కట్ , మరో రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ కలిపి మొత్తం రూ. 6,000 ప్రయోజనంతో రూ. 48,999 కే లభించనుంది. మరోవైపు వన్‌ప్లస్ 13s ఫోన్ రూ. 3,000 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 46,999 కి రానుండగా, 2024 నాటి పాపులర్ ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 ఫోన్ ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే అంటే రూ. 49,999 కే అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఆరు నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

బడ్జెట్ ధరలోనే వన్‌ప్లస్ 'నోర్డ్' సిరీస్

మధ్య బడ్జెట్ వినియోగదారుల కోసం వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ ఫోన్ల ధరలను కూడా భారీగా తగ్గించారు. లేటెస్ట్ వన్‌ప్లస్ నోర్డ్ 6 (OnePlus Nord 6) ఫోన్‌పై రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 39,999 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్‌ప్లస్ నోర్డ్ CE 6 , వన్‌ప్లస్ నోర్డ్ CE 6 లైట్ మోడల్స్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి వరుసగా రూ. 29,999 , రూ. 22,999 ధరలకే లభించనున్నాయి. నోర్డ్ సిరీస్ ఫోన్లపై కూడా కంపెనీ 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తోంది.

టాబ్లెట్ కొంటే స్టైలస్ పెన్ ఉచితం

టాబ్లెట్లు కొనాలనుకునే వారికి ఈ సేల్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ అయిన 'వన్‌ప్లస్ ప్యాడ్ 4' ను రూ. 55,999 కి విక్రయిస్తున్నారు. దీనితో పాటు రూ. 5,499 విలువైన 'వన్‌ప్లస్ స్టైలో ప్రో' (Stylo Pro) పెన్ను ఉచితంగా ఇస్తున్నారు. అలాగే వన్‌ప్లస్ ప్యాడ్ గో 2 టాబ్లెట్ రూ. 26,499 కే లభిస్తుంది , దీనితో పాటు రూ. 3,999 విలువైన స్టైలస్ పెన్ పూర్తిగా ఉచితంగా వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో టాబ్లెట్ కావాలనుకునే వారు వన్‌ప్లస్ ప్యాడ్ లైట్‌ను కేవలం రూ. 16,999 కే సొంతం చేసుకోవచ్చు.

ఆడియో ప్రొడక్ట్స్ , ఇయర్‌బడ్స్‌పై ఆఫర్లు

సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ నోర్డ్ బడ్స్ 4 ఈ సేల్‌లో ప్రత్యేక ఆఫర్ కింద రూ. 3,099 కే లభించనుంది. వీటితో పాటు వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్‌లెస్ Z2 ANC నెక్‌బ్యాండ్ రూ. 1,899 కి, నోర్డ్ బడ్స్ 3R రూ. 1,599 కి, , నోర్డ్ బడ్స్ 4 ప్రో రూ. 3,799 ధరలకే అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ఆడియో క్వాలిటీ కోరుకునే వారి కోసం వన్‌ప్లస్ బడ్స్ 4 ధర రూ. 5,599 గాను, టాప్ ఎండ్ మోడల్ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ధర రూ. 9,999 గాను నిర్ణయించారు.

ఈ ప్రత్యేక ఆఫర్లు జూలై 4 నుండి అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ ఇండియా అధికారిక సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్ , వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు ఎంపిక చేసిన కొన్ని వన్‌ప్లస్ ప్రొడక్ట్స్ ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, మైంత్రా , ఇతర రిటైల్ స్టోర్లలో కూడా లభించనున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story