Money: డబ్బు నీళ్లలా ఖర్చు అయిపోతోందా.? అయితే ఇలా చేయండి.!
Money: చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతోందా? అయితే డబ్బును వీలైనంత ఆదా చేయడానికి ఆర్థిక నిపుణులు చెబుతున్న 'వీక్లీ రివ్యూ' ట్రిక్ ఏంటో తెలుసుకోండి.
Money: డబ్బు నీళ్లలా ఖర్చు అయిపోతోందా.? అయితే ఇలా చేయండి.!
Money: నెల జీతం చేతికి రాగానే ఎటెళ్లిపోతుందో తెలియడం లేదా? అనవసర ఖర్చులు పెరిగిపోయి డబ్బులు అసలు మిగలట్లేదని బాధపడుతున్నారా? అయితే డబ్బును సరైన రీతిలో పొదుపు చేయడానికి ఆర్థిక నిపుణులు ఒక అద్భుతమైన సూచన చేస్తున్నారు. డబ్బును వీలైనంత ఆదా చేసేందుకు 'వీక్లీ రివ్యూ' పద్ధతి బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
అసలు ఈ వీక్లీ రివ్యూ ఏంటంటే.. వారమంతా మనం ఏయే వాటికి ఎంతెంత ఖర్చు పెట్టాం, మనకు వచ్చిన ఆదాయం ఎంత అనే విషయాలను వారాంతంలో ఒకసారి బేరీజు వేసుకోవడం. ఈ లెక్కలు చూసుకోవడానికి సెలవు దినమైన ఆదివారం పర్ఫెక్ట్ ఛాయిస్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఆదివారం ప్రశాంతంగా కూర్చుని వారం రోజుల లెక్కలు రాసుకుంటే, మనం ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు చేశాం, డబ్బు ఎంత వేస్ట్ అవుతోంది, ఇంకెంత మిగల్చొచ్చు అనే విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి.
ఈ విధంగా వారం వారం సమీక్ష చేసుకోవడం వల్ల మనం చేసే ఆర్థిక తప్పిదాలు తెలుసుకుని, వచ్చే వారం చేయబోయే ఖర్చులను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా నిరంతరం అనవసర ఖర్చులను గుర్తించి కట్టడి చేయడం ద్వారా మిగిలిన ఆ డబ్బును సేవింగ్స్ ఖాతాలో వేసుకోవచ్చు లేదా మంచి రాబడినిచ్చే ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడిగా పెట్టొచ్చు. ఇలాంటి చిన్నపాటి ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ వివరిస్తున్నారు.




