Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు ఈఎంఐలో కడుతున్నారా.? ఈ తప్పులు అస్సలు చేయకండి
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లును ఒకేసారి కట్టలేక ఈఎంఐ ఆప్షన్‌గా కన్వర్ట్ చేస్తున్నారా.? అయితే మీరు తెలియకుండానే భారీగా నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లు ఈఎంఐలో కడుతున్నారా.? ఈ తప్పులు అస్సలు చేయకండి
Credit Card: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం సర్వసాధారణంగా మారిపోయింది. ఆఫర్లు ఉన్నాయని లేదా కొనుగోలు శక్తి ఉందని అవసరానికి మించి ఖర్చు చేయడం, తీరా బిల్లు జనరేట్ అయ్యాక దాన్ని ఒకేసారి కట్టలేక ఇబ్బంది పడటం చాలామందికి అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సులభంగా ఎంచుకునే ఆప్షన్.. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చుకోవడం. అయితే, ఇలా కన్వర్ట్ చేయడం వల్ల మీరు తెలియకుండానే భారీగా నష్టపోతున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈఎంఐ ఆప్షన్‌తో వచ్చే నష్టాలు ఏంటి?
బిల్లును ఈఎంఐగా మార్చుకోవడం నెలనెలా తక్కువ మొత్తంలో కట్టుకోవడానికి సులభంగా అనిపించినప్పటికీ, దీని వెనుక మీ జేబుకు చిల్లులు పడే అనేక అంశాలు ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. అవేంటంటే..
హై ఇంట్రెస్ట్: క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చినప్పుడు బ్యాంకులు భారీ స్థాయిలో వడ్డీని వసూలు చేస్తాయి. ఇది మనం సాధారణంగా తీసుకునే పర్సనల్ లోన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ: మీరు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోగానే బ్యాంకులు ముందుగా ప్రాసెసింగ్ ఫీజును విధిస్తాయి. దీనికి తోడు ప్రతి నెలా మీరు కట్టే ఈఎంఐలోని వడ్డీపై జీఎస్టీ అదనంగా పడుతుంది.
ఫోర్‌క్లోజర్ ఛార్జీలు: ఒకవేళ మీకు మధ్యలో డబ్బులొచ్చి, ఈఎంఐలన్నీ ఒకేసారి ముందుగానే క్లియర్ చేద్దామనుకున్నా సరే.. దానికి కూడా బ్యాంకులు ఫోర్‌క్లోజర్ ఫీజు పేరుతో మీ దగ్గర నుండి అదనపు ఛార్జీలు వసూలు చేస్తాయి.
పెరగనున్న రుణ భారం:
పైన చెప్పిన ఛార్జీలన్నీ కలిపితే మీరు అసలు కట్టాల్సిన బిల్లు కంటే చాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఛార్జీలన్నీ కలిసి చివరకు తడిసిమోపెడవుతాయి. మొత్తంగా చూసుకుంటే మీరు ఊహించిన దానికంటే భారీ మొత్తాన్ని బ్యాంకులకే చెల్లిస్తారని, దీనివల్ల టోటల్ రీపేమెంట్ బర్డెన్ అమాంతం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
కాబట్టి, క్రెడిట్ కార్డు వాడేటప్పుడే మన తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేయడం, జనరేట్ అయిన బిల్లును గడువు లోపు పూర్తిగా చెల్లించడం ద్వారా ఇలాంటి ఆర్థిక నష్టాల నుంచి బయటపడవచ్చు.




