UPI Charges: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని స్వాగతించిన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ.. షేర్లు భారీ జంప్!

UPI Charges: యూపీఐ లావాదేవీలపై ఎన్‌పీసీఐ తీసుకున్న కొత్త నిర్ణయాన్ని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు.

Arun Chilukuri
Published on: 16 Sept 2026 3:22 PM IST
UPI Charges
X

UPI Charges: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని స్వాగతించిన పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ.. షేర్లు భారీ జంప్!

UPI Charges: రూ.2,000 దాటిన నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధించాలన్న ఎన్‌పీసీఐ నిర్ణయంపై పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ సానుకూలంగా స్పందించారు. ఇది సామాన్య వినియోగదారులు, చిరు వ్యాపారులకు ఎంతో మేలు చేసే 'రాబిన్ హుడ్' తరహా విధానమని ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం ద్వారా యూపీఐ సేవలు సామాన్యులకు ఎప్పటికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.

ఇ-కామర్స్ దిగ్గజాలు, పెద్ద రిటైల్ చైన్‌ల వంటి భారీ వ్యాపారుల నుంచి సేకరించే ఈ ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజలకు యూపీఐ సేవలను ఫ్రీగా కొనసాగించేందుకు వినియోగించవచ్చని తెలిపారు.

ఇప్పటివరకు ప్రభుత్వ మద్దతుతోనే ప్రధానంగా సాగిన యూపీఐ వ్యవస్థను ఈ కొత్త నిబంధనలు ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో పేటీఎం మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్' షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఇంట్రాడేలో ఏకంగా 7.24 శాతం పెరిగి రూ.1,856.50 వద్ద తాజా 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి.పేటీఎం బాటలోనే మొబిక్విక్, పైన్‌ల్యాబ్స్ వంటి ఇతర ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థల షేర్లలోనూ సానుకూల ట్రెండ్ కనిపించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.