Paytmలో పాకెట్ మనీ ఫీచర్.. ఇంతకీ ఏంటీ ఫీచర్.? ఎలా పని చేస్తుంది?
Paytm: డిజిటల్ పేమెంట్లు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎమ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Paytmలో పాకెట్ మనీ ఫీచర్.. ఇంతకీ ఏంటీ ఫీచర్.? ఎలా పని చేస్తుంది?
Paytm: డిజిటల్ పేమెంట్లు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎమ్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. “Paytm Pocket Money” పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుంది.? దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంక్ అకౌంట్ లేకుండానే UPI పేమెంట్లు
ఈ కొత్త ఫీచర్‌తో పిల్లలు తమ మొబైల్‌లో పేటీఎమ్ యాప్ ఉపయోగించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపుల్లో సులభంగా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటి వరకు చిన్న ఖర్చుల కోసం తల్లిదండ్రుల ఫోన్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వారి స్వంత మొబైల్ నుంచే పేమెంట్లు చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఇంకా బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్లకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది.
ఖర్చులపై పూర్తిగా తల్లిదండ్రుల నియంత్రణ
ఈ ఫీచర్‌లో ప్రధాన ఆకర్షణ పేరెంట్స్ కంట్రోల్ వ్యవస్థ. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు పిల్లల ఖర్చులపై పూర్తి నిఘా ఉంచవచ్చు. నెలకు ఎంత వరకు ఖర్చు చేయాలో ముందుగానే లిమిట్ సెట్ చేయవచ్చు. అలాగే ప్రతి ట్రాన్సాక్షన్‌ను రియల్ టైమ్‌లో చూడొచ్చు. NPCI రూపొందించిన యూపీఐ సర్కిల్ సదుపాయం ద్వారా కుటుంబ సభ్యులు పిల్లలను తమ అకౌంట్‌తో లింక్ చేయవచ్చు.
ఖర్చు పరిమితులు ఇలా ఉంటాయి
పేటీఎమ్ పాకెట్ మనీలో భద్రత కోసం కొన్ని ఖర్చు పరిమితులు కూడా పెట్టారు. నెలకు గరిష్టంగా రూ.15,000 వరకు మాత్రమే ఖర్చు చేయగలరు. ఒక్కసారి చేసే పేమెంట్ రూ.5,000 దాటకూడదు. ఫీచర్ ప్రారంభమైన తొలి 30 నిమిషాల్లో రూ.500 వరకు మాత్రమే చెల్లింపు చేయవచ్చు మొదటి 24 గంటల్లో రూ.5,000 వరకు పరిమితి అమల్లో ఉంటుంది ఈ విధానం వల్ల పొరపాట్లు లేదా దుర్వినియోగం జరిగే అవకాశాలు తగ్గుతాయని కంపెనీ తెలిపింది.
ఖర్చుల వివరాలు కూడా వెంటనే కనిపిస్తాయి
Paytmలో “Spend Summary” అనే ప్రత్యేక ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పిల్లలు చేసిన ఖర్చులు ఆటోమేటిక్‌గా వేర్వేరు కేటగిరీల్లో కనిపిస్తాయి. డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది అనే విషయం కుటుంబ సభ్యులు సులభంగా తెలుసుకోవచ్చు. అదే సమయంలో పిల్లలకు కూడా ఖర్చులను ఎలా నియంత్రించాలో అర్థమవుతుంది. అవసరమైతే తల్లిదండ్రులు Paytm యూపీఐ పిన్ ద్వారా ఖర్చు పరిమితిని మార్చవచ్చు. సేవను పూర్తిగా నిలిపివేయడానికీ అవకాశం ఉంటుంది.
దీనిని ఎలా యాక్టివేట్ చేయాలి.?
ఈ ఫీచర్ ఉపయోగించాలంటే ముందుగా పేటీఎమ్ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి.
* మొదట పేటీఎమ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* “To Mobile / Contact” ఆప్షన్‌లోకి వెళ్లాలి.
* “Pocket Money” ఎంపికపై ట్యాప్ చేయాలి.
* ఫీచర్ యాక్టివేట్ చేయాలనుకున్న వ్యక్తి కాంటాక్ట్ ఎంపిక చేయాలి.
* UPI QR కోడ్ స్కాన్ చేయాలి లేదా UPI ID నమోదు చేయాలి.
* అవసరమైన డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
* బ్యాంక్ అకౌంట్ ఎంపిక చేసి UPI PIN నమోదు చేయాలి.
* చివరగా నెలవారీ ఖర్చు పరిమితి సెట్ చేయాలి
* అనంతరం పిల్లలు లేదా సంబంధిత వ్యక్తి ఇన్విటేషన్‌ను యాక్సెప్ట్ చేస్తే ఫీచర్ యాక్టివ్ అవుతుంది.




