Penny Stock: రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన క్రేజీ షేరు..!
Cupid Limited Share: స్టాక్ మార్కెట్లో సరైన రీసెర్చ్, కాస్త ఓపిక ఉంటే ఊహించని రీతిలో భారీ సంపదను సృష్టించవచ్చని ఇప్పటికే చాలా స్టాక్స్ నిరూపించాయి.
Penny Stock: రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన క్రేజీ షేరు..!
Cupid Limited Share: స్టాక్ మార్కెట్లో సరైన రీసెర్చ్, కాస్త ఓపిక ఉంటే ఊహించని రీతిలో భారీ సంపదను సృష్టించవచ్చని ఇప్పటికే చాలా స్టాక్స్ నిరూపించాయి. ఇప్పుడు అదే విషయాన్ని ప్రముఖ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ క్యూపిడ్ లిమిటెడ్ స్టాక్ మరోసారి రుజువు చేసింది. ఐదేళ్ల క్రితం కేవలం ఒక సాధారణ పెన్నీ స్టాక్‌గా ఉన్న క్యూపిడ్ షేరు ధర, ప్రస్తుతం ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. మార్కెట్లో ఎన్ని ఒడుదొడుకులు ఉన్నా, ఈ స్మాల్ క్యాప్ స్టాక్ తన ఇన్వెస్టర్లపై లాభాల వర్షం కురిపించింది.
ఐదేళ్ల క్రితం జులై 2021 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ స్టాక్ కేవలం రూ. 2.45 స్థాయిలోనే ట్రేడయింది. కానీ నేడు ఈ షేరు ధర ఏకంగా రూ. 213 స్థాయికి చేరుకుంది. గత 5 సంవత్సరాల కాలంలో ఈ స్టాక్ ఏకంగా 8600 శాతానికి పైగా అద్భుతమైన రిటర్న్స్ అందించింది. ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఐదేళ్ల క్రితం ఈ షేరుపై రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి, ఓపికగా అలాగే ఉంచుకుని ఉంటే.. నేడు దాని విలువ ఏకంగా రూ. 87 లక్షలకు చేరి ఉండేది. కేవలం దీర్ఘకాలంలోనే కాదు, గతేడాది కాలంలోనూ ఈ స్టాక్ దుమ్మురేపింది. ఏడాది క్రితం పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి విలువ ఇప్పుడు రూ. 8.40 లక్షలుగా మారడం విశేషం.
క్యూపిడ్ లిమిటెడ్ కేవలం మార్కెట్ సెంటిమెంట్‌తోనే కాకుండా, బలమైన వ్యాపార వృద్ధితోనూ దూసుకుపోతోంది. కంపెనీ త్వరలోనే ప్రకటించబోయే క్యూ1 ఆదాయం సరికొత్త రికార్డ్ స్థాయిలో రూ. 150 కోట్లు దాటుతుందని అంచనా వేసింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్‌ను 10 శాతం మేర పెంచుతూ, రూ. 660 కోట్లుగా కంపెనీ మేనేజ్‌మెంట్ సవరించింది. గ్లోబల్ బిజినెస్ టు బిజినెస్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ టెండర్లు, హెల్త్‌కేర్ ప్రొక్యూర్మెంట్ సంస్థలతో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు కంపెనీ ఆర్డర్ బుక్‌ను మరింత బలోపేతం చేశాయి.
కేవలం ఒకే రకమైన ప్రొడక్టుపై ఆధారపడకుండా, ఇన్ విట్రో డయాగ్నోస్టిక్స్ వంటి సరికొత్త హెల్త్‌కేర్ విభాగాల్లోకి అడుగుపెట్టడం కంపెనీ భవిష్యత్తు వృద్ధికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. చివరి ట్రేడింగ్ సెషన్‌లో క్యూపిడ్ లిమిటెడ్ షేరు ధర 1.41 శాతం లాభంతో రూ. 212.98 వద్ద ముగిసింది.
52 వారాల గరిష్ఠ ధర: రూ. 226
52 వారాల కనిష్ఠ ధర: రూ. 21.65
ప్రస్తుత మార్కెట్ విలువ: రూ. 28,530 కోట్లు
పెన్నీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు కంపెనీ ఫండమెంటల్స్ గమనించడం ఎంత ముఖ్యమో, క్యూపిడ్ లిమిటెడ్ సాధించిన ఈ అద్భుత వృద్ధిని చూస్తే అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లో సరైన రీసెర్చ్ ఉంటే మట్టి కూడా బంగారం అవుతుంది అనడానికి ఈ స్టాకే ఒక ఉదాహరణ.




