Petrol Price Today : గత 11 రోజుల్లోనే 4 సార్లు బాదేసారు..మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

Petrol Price Today : ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు, నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే దేశంలోని అన్ని నగరాల ఇంధన ధరలు అప్‌డేట్ అవుతాయి.

CR Reddy
Published on: 5 Jun 2026 7:36 AM IST
Petrol Price Today : గత 11 రోజుల్లోనే 4 సార్లు బాదేసారు..మరి ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
X

Petrol Price Today : దేశంలో ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ సాధారణ ప్రజల నియంత్రణ దాటిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరల నుంచి బంగారం, వెండి వరకు అన్నింటి రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, చమురు వినియోగదారులకు ఈరోజు అంటే జూన్ 5వ తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థల నుంచి కొంత ఉపశమనం లభించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు, నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే దేశంలోని అన్ని నగరాల ఇంధన ధరలు అప్‌డేట్ అవుతాయి.

ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 కాగా, డీజిల్ ధర రూ.95.20 వద్ద స్థిరంగా ఉంది. ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.115.69 వద్ద విక్రయించబడుతుండగా, డీజిల్ లీటర్ ధర రూ.103.82గా కొనసాగుతోంది. అదేవిధంగా వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.111.21, డీజిల్ ధర రూ.97.83 వద్ద ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ.99.82కు విక్రయించబడుతోంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.107.77, డీజిల్ రూ.99.55 వద్ద ఉన్నాయి.

ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.97.56 వద్ద ఉన్నాయి. చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.101.51, డీజిల్ ధర రూ.89.47గా నమోదైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పెట్రోల్ లీటర్ రూ.101.89, డీజిల్ రూ.95.36 వద్ద విక్రయించబడుతోంది. బీహార్ రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.37 గా ఉండగా, డీజిల్ రూ.99.36 వద్ద ఉంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో పెట్రోల్ రూ.105.26, డీజిల్ రూ.100.49గా ఉంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పెట్రోల్ ధర రూ.114.57 కాగా, డీజిల్ ధర రూ.99.64 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, గత 11 రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఏకంగా నాలుగు సార్లు ఇంధన ధరలను భారీగా పెంచాయి. మే 15, 2026 న మొదటిసారిగా పెట్రోల్ ధరను రూ.3, డీజిల్ ధరను రూ.3.29 పెంచారు. ఆ తర్వాత మే 19న పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచగా, మే 23న కూడా అదే స్థాయిలో ధరలను పెంచారు. చివరిగా మే 25న పెట్రోల్ పై రూ.2.61, డీజిల్ పై రూ.2.71 చొప్పున వడ్డించారు. దీనివల్ల గత 12 రోజుల్లోనే సామాన్యులపై లీటరుకు సుమారు రూ.7 నుండి రూ.8 వరకు అదనపు భారం పడింది.

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌కు చమురు సరఫరా నిలిచిపోతుందేమోననే భయం చమురు కంపెనీలను ధరలు పెంచేలా చేస్తోంది. కస్టమర్లు తమ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా రోజువారీ ధరలను సులభంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు 'RSP <స్పేస్> సిటీ కోడ్' రాసి 9224992249 నంబర్‌కు, బీపీసీఎల్ వినియోగదారులు 'RSP <స్పేస్> సిటీ కోడ్' రాసి 9223112222 నంబర్‌కు, అలాగే హెచ్‌పీసీఎల్ వినియోగదారులు 'HPPRICE <స్పేస్> సిటీ కోడ్' రాసి 9222201122 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి తాజా రేట్లు తెలుసుకోవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story