Petrol Diesel Price : వాహనదారులకు అదిరిపోయే వార్త.. పెట్రోల్ ధరల పరుగుకు బ్రేక్ వేసిన కంపెనీలు
Petrol Diesel Price : దేశవ్యాప్తంగా జూన్ 15న పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Petrol Diesel Price
Petrol Diesel Price : దేశంలోని వాహనదారులకు చమురు విక్రయ సంస్థలు పెద్ద ఊరటనిచ్చాయి. జూన్ 15వ తేదీన దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో నిరంతరం ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నప్పటికీ.. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం గమనార్హం. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్లోబల్ మార్కెట్ కన్ను క్రూడ్ ఆయిల్ కదలికలపైనే ఉంది.
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.115.73 వద్ద విక్రయించబడుతోంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ.103.82 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12 గా ఉండగా, డీజిల్ ధర రూ.95.20 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ అత్యధికంగా రూ.111.21, డీజిల్ రూ.97.83 వద్ద ట్రేడవుతోంది. కోల్కతాలో పెట్రోల్ రూ.113.47, డీజిల్ రూ.99.82, చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.107.88, డీజిల్ రూ.99.65 వద్ద విక్రయించబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పెట్రోల్ రూ.101.86, డీజిల్ రూ.95.36 గా ఉండగా, నోయిడాలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.56 వద్ద స్థిరంగా ఉన్నాయి.
ఇక బిహార్ విషయానికి వస్తే, అక్కడ ఇంధన ధరలు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.113.37 వద్ద కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విధించే స్థానిక పన్నులు, వ్యాట్ ఎక్కువగా ఉండటం వల్లే బిహార్లో పెట్రోల్ ధరలు దేశంలోని పలు ఇతర నగరాల కంటే ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
గత మే నెలలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయిల్ కంపెనీలు ధరలను నిరంతరం సమీక్షిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి వినియోగదారులకు భారం పడకుండా రేట్లను పెంచకుండా అలాగే ఉంచాయి. దేశంలోని ప్రతి నగరంలో ఇంధన ధరలు వేర్వేరుగా ఉండటానికి ప్రధాన కారణం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండే వ్యాట్, లోకల్ టాక్స్లు, ఫ్రైట్ ఛార్జీలు, డీలర్ కమీషన్లే. వీటి ఆధారంగానే ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఆయిల్ కంపెనీలు కొత్త ధరలను అప్డేట్ చేస్తుంటాయి.
ప్రస్తుతానికి ధరలు అదుపులోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గనుక ఇలాగే పెరగుతూ పోతే, మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం మరింత తీవ్రమైతే దేశీయంగా చమురు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. వినియోగదారులు తమ నగరాల తాజా ధరలను ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వెబ్సైట్ల ద్వారా లేదా ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా ప్రతిరోజూ సులభంగా తెలుసుకోవచ్చు.




