Haldia Bulk Terminal: హాల్దియాలో దేశంలోనే తొలి ఆటోమేటెడ్ డ్రై బల్క్ టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
Haldia Bulk Terminal: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నిర్మించిన మన దేశపు మొట్టమొదటి ఫుల్లీ ఆటోమేటెడ్ హల్దియా డ్రై బల్క్ సెంటర్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
Haldia Bulk Terminal
Haldia Bulk Terminal: భారత మౌలిక సదుపాయాల రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లోని హాల్దియాలో 'హాల్దియా బల్క్ టెర్మినల్'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (మార్చి 14, 2026) జాతికి అంకితం చేశారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఫుల్లీ ఆటోమేటెడ్ డ్రై బల్క్ సౌకర్యం. దీనిని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ నిర్మించింది.
లాజిస్టిక్స్ ఖర్చులకు కత్తెర
హూగ్లీ నది తీరాన వ్యూహాత్మకంగా నిర్మించారు. దీని ద్వారా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఉక్కు, అల్యూమినియం, విద్యుత్ పరిశ్రమలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలివే..
సామర్థ్యం: ఈ టెర్మినల్ ఏడాదికి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల డ్రై బల్క్ కార్గోను హ్యాండిల్ చేయగలదు.
ట్రైన్ కనెక్టివిటీ: ఓడల నుంచి నేరుగా రైలు వ్యాగన్లలోకి సరుకును చేరవేసే విధంగా 1.54 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే లైన్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనివల్ల సరుకు రవాణా సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతాయి.
హై ఎండ్ టెక్నాలజీ..
దీని నిర్మాణ పనులు జూలై 14, 2023న ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టును కేవలం 30 నెలల వ్యవధిలోనే పూర్తి చేసి APSEZ తన సామర్థ్యాన్ని చాటుకుంది.
టెర్మినల్‌లో ఉన్న కీలక వసతులు ఇవే:
RWLS వ్యవస్థ: గంటకు 2,000 టన్నుల సామర్థ్యం గల రైల్వే వ్యాగన్ లోడింగ్ సిస్టమ్.
ఆటోమేషన్: సరుకు నష్టాన్ని తగ్గించేందుకు అధునాతన కన్వేయర్ సిస్టమ్స్ , రెండు స్టాకర్-కమ్-రిక్లెయిమర్లు అందుబాటులో ఉంచారు
పర్యావరణ హితం: జెట్టీల వద్ద సరుకు నిల్వను నివారించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, సురక్షితమైన ఆపరేషన్లకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఫీచర్ | వివరాలు |
నిర్వహించే సరుకు | బొగ్గు, బాక్సైట్, సున్నపురాయి వంటి డ్రై బల్క్ |
మొత్తం బెర్తులు | 1 (పొడవు: 193 మీటర్లు) |
మొబైల్ హార్బర్ క్రేన్లు | 2 యూనిట్లు |
రైల్వే లైన్ | 1.54 కిలోమీటర్లు |
ఒప్పంద కాలం | 30 ఏళ్లు (DBFOT మోడల్) |
గతిశక్తి - సాగరమాల లక్ష్యాల దిశగా..
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సాగరమాల', 'పీఎం గతిశక్తి' నేషనల్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఈ టెర్మినల్ నిర్మాణం జరిగింది. మల్టీమోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దేశీయ లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. "హాల్దియా బల్క్ టెర్మినల్ తూర్పు భారతదేశ పారిశ్రామిక సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది" అని APSEZ సీఈఓ అశ్విని గుప్తా పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఓడరేవులను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్గో నిర్వహణ లక్ష్యంగా దూసుకుపోతోంది. తాజా హాల్దియా టెర్మినల్ ప్రారంభంతో తూర్పు తీరంలో వాణిజ్య కార్యకలాపాలు మరింత వేగవంతం కానున్నాయి.




