Post Office: ప్రతీ నెల మీ అకౌంట్లోకి ఆటోమెటిక్‌గా రూ. 5500 పడతాయి.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Post Office: రిటైర్మెంట్ తర్వాత లేదా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) మంచి పెట్టుబడి పథకంగా చెప్పొచ్చు.
Post Office: ప్రతీ నెల మీ అకౌంట్లోకి ఆటోమెటిక్‌గా రూ. 5500 పడతాయి.. బెస్ట్ సేవింగ్ స్కీమ్
Post Office: రిటైర్మెంట్ తర్వాత లేదా ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) మంచి పెట్టుబడి పథకంగా చెప్పొచ్చు. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం మీ బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది. అసలు పెట్టుబడి కూడా సురక్షితంగానే ఉంటుంది.
పోస్టాఫీస్ MIS స్కీమ్ అంటే ఏంటి?
పోస్టాఫీస్ నిర్వహించే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) ఒక చిన్న పొదుపు పథకం. ఇందులో పదే పదే డబ్బు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడితే చాలు. ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీని నెలనెలా లెక్కించి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. అందువల్ల ప్రతి నెలా ఒక స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఎంత పెట్టుబడితో ఖాతా తెరవొచ్చు? గరిష్ట పరిమితి ఎంత?
ఈ పథకంలో కనీసం రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. పెట్టుబడి పరిమితుల విషయానికొస్తే.. సింగిల్ అకౌంట్ గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్లో అయితే గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్లో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు సభ్యులుగా ఉండవచ్చు. ఖాతా ప్రారంభించడానికి పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉండటం తప్పనిసరి.
రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు ఎంత వస్తుంది?
ఒకవేళ మీరు సింగిల్ అకౌంట్లో రూ.9 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రస్తుతం ఉన్న 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా రూ.5,550 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తం ప్రతి నెలా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. దీంతో ఉద్యోగం లేకపోయినా లేదా రిటైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ ఆదాయం పొందవచ్చు.
మెచ్యూరిటీ తర్వాత ఏమవుతుంది?
పోస్టాఫీస్ MIS పథకం 5 సంవత్సరాల కాలపరిమితి కలిగి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా వడ్డీ వస్తూనే ఉంటుంది. గడువు పూర్తయిన తర్వాత మీరు పెట్టిన అసలు పెట్టుబడి మొత్తం తిరిగి మీకు అందుతుంది. అంటే, ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు పెట్టుబడి కూడా సురక్షితంగా తిరిగి లభిస్తుంది.
ఈ పథకం ఎవరికి అనుకూలం?
పోస్టాఫీస్ MIS పథకం ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం కోరుకునే వారు, సురక్షిత పెట్టుబడి కోరుకునే పెట్టుబడిదారులు, మార్కెట్ రిస్క్ లేకుండా ఆదాయం పొందాలనుకునే వారికి ఈ పథకం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అయితే, ఈ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేట్లు, నిబంధనలను ఒకసారి పోస్టాఫీస్‌లో లేదా అధికారిక వెబ్సైట్లో పరిశీలించడం మంచిది. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది.




