Post Office: ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల ఫిక్స్ ఆదాయం.. జీరో రిస్క్
Post Office: ఈ రోజుల్లో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు.
Post Office: ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల ఫిక్స్ ఆదాయం.. జీరో రిస్క్
Post Office: ఈ రోజుల్లో మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండటంతో చాలా మంది సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) మంచి ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో ఒకసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా నిర్దిష్టమైన ఆదాయం వస్తుంది.
పోస్టాఫీస్ ఎమ్ఐఎస్ అంటే ఏంటి.?
ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే స్మాల్ సేవింగ్స్ పథకం. ముఖ్యంగా రిటైర్ అయిన వారు లేదా ప్రతి నెల ఫిక్స్ ఆదాయం కావాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి సురక్షితంగా ఉండటంతో పాటు, నెల నెలా ఆదాయం వస్తుండటం ఈ పథకం ప్రత్యేకత.
వడ్డీ రేటు, నెలవారీ ఆదాయం
ప్రస్తుతం ఈ స్కీమ్‌పై సుమారు 7.40% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీని ప్రతి నెల మీ ఖాతాలో జమ చేస్తారు. ఉదాహరణకు మీరు రూ. 9 లక్షలు పెట్టుబడి పెడితే సంవత్సరానికి సుమారు రూ. 66,600 వడ్డీ వస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు రూ. 5,550 ఆదాయం పొందవచ్చు.
జాయింట్ అకౌంట్‌లో ఎక్కువ లాభం
ఈ స్కీమ్‌లో జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలు. ఈ మొత్తంపై సంవత్సరానికి సుమారు రూ. 1,11,000 వడ్డీ వస్తుంది. అంటే ప్రతి నెల దాదాపు రూ. 9,250 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
కాలపరిమితి, ముఖ్య నియమాలు
ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. 5 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బును తిరిగి పొందవచ్చు. అవసరమైతే మళ్లీ పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని కొనసాగించవచ్చు. అయితే గడువు పూర్తికాకముందే డబ్బు తీసుకుంటే కొంత పెనాల్టీ చెల్లించాలి. అందుకే ముందుగా ప్లాన్ చేసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది.




