Post Office: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. పోస్టాఫీస్ అందిస్తోన్న 3 బెస్ట్ స్కీమ్స్ ఇవే

Post Office: సంపాదనలో కొంద మొత్తాన్ని పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మారిన ఆర్థిక పరిస్థితులు ఉద్యోగాల్లో అస్థిరత కారణంగా పొదుపు చేస్తున్నారు.

Mokshith
Published on: 23 April 2026 4:29 PM IST
Post Office
X

Post Office

Post Office: సంపాదనలో కొంద మొత్తాన్ని పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మారిన ఆర్థిక పరిస్థితులు ఉద్యోగాల్లో అస్థిరత కారణంగా పొదుపు చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది బ్యాంక్ FDలను నమ్ముతారు. కానీ ఇటీవల బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడంతో, ప్రజలు కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ సమయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ మంచి ఎంపికగా మారాయి.

పోస్టాఫీస్ స్కీమ్స్ ఎందుకు మంచి ఎంపిక?

పోస్టాఫీస్ స్కీమ్స్‌లో ప్రధానంగా సేఫ్టీ, గ్యారంటీడ్ రిటర్న్ ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి డబ్బు సురక్షితంగా ఉంటుంది. పైగా కొన్ని స్కీమ్స్‌లో 7% కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన లాభం కావాలనుకునేవారికి ఇవి సరైన ఎంపికగా నిలుస్తాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటే NSC, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం మంచి ఆప్షన్. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై సుమారు 7.7% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతి సంవత్సరం కంపౌండ్ అవుతూ పెరుగుతుంది. ఉదాహరణకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత దాదాపు 14,490 రూపాయల వరకు పెరుగుతుంది.

ఈ స్కీమ్‌లో పెట్టిన మొత్తం ప్రభుత్వ గ్యారంటీతో ఉంటుంది. అలాగే సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే డబ్బు 5 సంవత్సరాల పాటు లాక్ అవుతుంది.

సుకన్య సమృద్ధి యోజన

సుకన్య సమృద్ధి యోజన ప్రత్యేకంగా అమ్మాయిల భవిష్యత్తు కోసం రూపొందించిన స్కీమ్. ప్రస్తుతం దీనిపై సుమారు 8.2% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇది మార్కెట్‌లో లభించే అత్యంత భద్రమైన అధిక వడ్డీ రేట్లలో ఒకటి.

ఈ స్కీమ్‌లో తల్లిదండ్రులు తమ కూతురు పేరుతో ఖాతా తెరచి 15 సంవత్సరాల పాటు డబ్బు జమ చేయవచ్చు. ఖాతా 21 సంవత్సరాలు లేదా పెళ్లి వరకు కొనసాగుతుంది. ఇందులో పెట్టిన మొత్తం, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా టాక్స్ ఫ్రీగా ఉంటుంది. కూతురి చదువు, పెళ్లి వంటి ఖర్చులకు ఇది చాలా ఉపయోగపడే ప్లాన్.

కిసాన్ వికాస్ పత్ర (KVP)

కిసాన్ వికాస్ పత్రలో పెట్టిన డబ్బు దాదాపు 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం దీనిపై సుమారు 7.5% వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి దాదాపు 20,000 రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్ కూడా పూర్తిగా ప్రభుత్వ గ్యారంటీతో ఉంటుంది. అందుకే పెట్టుబడిదారులకు ఎలాంటి రిస్క్ ఉండదు. సాధారణంగా మెచ్యూరిటీకి ముందు డబ్బు తీసుకోవడం కష్టం అయినా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంలో సేఫ్‌గా డబ్బు పెంచుకోవాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.

ఎవరికీ ఏ స్కీమ్ బెస్ట్?

సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కోరుకునే వారికి NSC, పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసేవారికి సుకన్య సమృద్ధి యోజన, దీర్ఘకాలంలో డబ్బు రెట్టింపు కావాలనుకునేవారికి KVP సరైన ఎంపిక. మీ అవసరం, గడువు, లక్ష్యాన్ని బట్టి ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది.

మొత్తం మీద పోస్టాఫీస్ స్కీమ్స్ ప్రస్తుతం బ్యాంక్ FDలకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. అధిక వడ్డీ, ప్రభుత్వ భద్రత, టాక్స్ ప్రయోజనాలు కలిపి ఇవి సాధారణ పెట్టుబడిదారులకు మంచి అవకాశం అందిస్తున్నాయి. సరైన స్కీమ్ ఎంచుకుని చిన్న మొత్తాలతో మొదలుపెడితే భవిష్యత్తులో పెద్ద లాభాలు పొందవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story