Post Office: భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు క‌లిసి పెట్టుబ‌డి పెడితే.. నెల‌కు రూ. 19 వేల వ‌డ్డీ పొందొచ్చు!

Post Office: రిటైర్మెంట్ త‌ర్వాత నెలవారీ ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళన చాలామందిలో ఉంటుంది.

Mokshith
Published on: 24 Sept 2026 4:21 PM IST
Post Office
X

Post Office: భార్య‌భ‌ర్త‌లిద్ద‌రు క‌లిసి పెట్టుబ‌డి పెడితే.. నెల‌కు రూ. 19 వేల వ‌డ్డీ పొందొచ్చు!

Post Office: రిటైర్మెంట్ త‌ర్వాత నెలవారీ ఖర్చులకు డబ్బు ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళన చాలామందిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో చేతిలో ఉన్న రిటైర్మెంట్ డబ్బును పూర్తిగా ఖర్చు చేయకుండా, సురక్షితమైన పథకంలో పెట్టుబడి పెట్టి దానిపై వచ్చే వడ్డీతో ఖర్చులు మ్యానేజ్ చేసుకోవ‌చ్చు. అలాంటి వారికి పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతంది.

ఎవ‌రు ఓపెన్ చేయొచ్చు.?

పోస్టాఫీస్ అందిస్తున్న సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం ప్రారంభ కాలవ్యవధి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పూర్తైన తర్వాత ఖాతాను మరో 3 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి ఈ పొడిగింపు సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ పథకంలో వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. అంటే ఏడాదికి నాలుగు విడతల్లో వడ్డీ అకౌంట్‌లో జమ అవుతుంది. పెట్టుబడి కాలం పూర్తైనప్పుడు అసలు మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

రూ.28 లక్షలు పెడితే ప్రతి 3 నెలలకు రూ.57,400

ఒక ఉదాహరణగా భార్యాభర్తలు చెరో రూ.14 లక్షలు SCSSలో పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అంటే ఇద్దరి కలిపి పెట్టుబడి రూ.28 లక్షలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న 8.2 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం రూ.28 లక్షలపై ఏడాదికి రూ.2,29,600 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తారు.

అంటే ప్రతి మూడు నెలలకు రూ.57,400 చొప్పున వడ్డీ లభిస్తుంది. అంటే సగటున నెలకు సుమారు రూ.19,133 ఆదాయం వచ్చినట్లుగా లెక్క. 5 సంవత్సరాల తర్వాత ఖాతాను మరో 3 సంవత్సరాలకు పొడిగిస్తే, మొత్తం 8 సంవత్సరాల కాలంలో వడ్డీ ఆదాయం సుమారు రూ.18,36,800 అవుతుంది. ఈ లెక్కల ప్రకారం కాలం పూర్తైనప్పుడు రూ.28 లక్షల అసలు పెట్టుబడితో పాటు వడ్డీ ఆదాయం ఉంటుంది.

పన్ను, పరిమితులు తెలుసుకుని పెట్టుబడి పెట్టాలి

SCSS ప్రభుత్వ మద్దతు ఉన్న పొదుపు పథకం కావడంతో రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. అయితే వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టుబడి పెట్టే సమయంలో ప్రస్తుత వడ్డీ రేటును తప్పనిసరిగా పరిశీలించాలి. SCSS పెట్టుబడిపై ఆదాయపు పన్ను నిబంధనలు వర్తిస్తాయి.

అర్హత ఉన్న పెట్టుబడులకు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం లభించే అవకాశం ఉంది. అలాగే వడ్డీ ఆదాయంపై వర్తించే TDS నిబంధనలను కూడా గమనించాలి. ముఖ్యంగా రూ.30 లక్షల గరిష్ఠ పెట్టుబడి పరిమితి, పన్ను స్లాబ్, వడ్డీ చెల్లింపు విధానం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.